Lara Virginity Auction: కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టిన లేడీ వేలంలో రూ. 18 కోట్లు..
ABN , Publish Date - Mar 13 , 2025 | 05:45 PM
Lara Virginity Auction: ఇంగ్లాండ్‌లో నివాసం ఉంటున్న లారా తన కన్యత్వాన్ని ఆన్లైన్‌లో వేలానికి పెట్టి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా సిండ్రెల్లా ఎస్కార్ట్స్ ఏజెన్సీ వెబ్‌సైట్ ద్వారా లారా.. తన కన్యత్వాన్ని అమ్మబోతున్నట్లు ప్రకటించగా..

ప్రతీ అమ్మాయి తన కన్యత్వాన్ని ప్రేమించిన వాడికో, కట్టుకున్న భర్తకో అందించాలనుకుంటోంది. అందుకోసం ఎన్ని ఏళ్లు అయినా వేచి చూస్తుంది. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే అమ్మాయి మాత్రం 22 ఏళ్లకే తన కన్యత్వాన్ని పోగొట్టుకోవాలనుకుంది. అలా అని ప్రేమించిన వాడికో, భర్తకో ఇవ్వాలనుకోలేదు. ఆక్షన్‌లో(వేలం) పెట్టి మరీ తన కన్యత్వాన్ని అమ్ముకోవాలనుకుంది. అనుకోవడం కాదు నిజంగానే అమ్ముకుంది. వినడానికి చెండాలంగా ఉన్నా ఇది మాత్రం నిజం. కన్యత్వాన్ని అమ్ముకోవడమే ఆశ్చర్యమంటే.. ఆ కన్యత్వాన్ని కోట్లు వెచ్చించడం సమాజాన్ని ముక్కున వేలేసుకునేలా చేసింది.
యువతి పేరు లారా. తన వయస్సు 22 ఏళ్ల. ఇంగ్లాండ్‌లో నివాసం ఉంటున్న లారా తన కన్యత్వాన్ని ఆన్లైన్‌లో వేలానికి పెట్టి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా సిండ్రెల్లా ఎస్కార్ట్స్ ఏజెన్సీ వెబ్‌సైట్ ద్వారా లారా.. తన కన్యత్వాన్ని అమ్మబోతున్నట్లు ప్రకటించగా.. అనేక మంది బిడ్‌లు వేశారు. హాలీవుడ్‌కి చెందిన ఒక ప్రముఖ నటుడు భారీ మొత్తాన్ని చెల్లించి లారాను పొందాడు. లారా కన్యత్వానికి 18 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వేలం తర్వాత లారా నేరుగా మీడియాతో మాట్లాడింది. తాను ఇలా చేయడం వల్ల ఏమాత్రం పశ్చాత్తాపం చెందడం లేదని వివరించింది.
చాలామంది అమ్మాయిలు తమ కన్యత్వాన్ని మోజులో పడి కోల్పోతారు. కానీ నేను దీని ద్వారా భవిష్యత్తుకు భద్రత కల్పించుకున్నానని చెప్పింది. ఈ వేలంలో వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, ఇతర శక్తివంతమైన వ్యక్తులు పాల్గొన్నారు. చివరికి హాలీవుడ్ నటుడు అత్యధిక ధరకు లారాను సొంతం చేసుకున్నాడు. ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె నిర్ణయాన్ని తప్పుపడుతుండగా, మరికొందరు ఇది వ్యక్తిగత స్వేచ్ఛగా భావిస్తున్నారు. ఇలాంటి వేలాలు సమాజానికి మంచి చేస్తున్నాయా.. లేక పాతకాలపు విలువలను ధిక్కరిస్తున్నాయా.. అనే అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.
Also Read:
అరే ఇదేంటీ.. మరీ విచిత్రంగా ఉందే..
రోహిత్‌ను ఎందుకు విమర్శిస్తారు: ఏబీడీ
For More Trending News and Telugu News..