Viral: వావ్.. చిన్న స్థలంలో అంత పెద్ద ఇల్లా? ఆ ప్లానింగ్ ఇచ్చిన వారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
ABN , Publish Date - Jan 06 , 2025 | 08:05 AM
ప్రస్తుతం నగరాల్లో స్థలం దొరకడమే గగనంగా మారిపోయింది. లక్షలు కుమ్మరిస్తే తప్ప సెంటు స్థలం దొరకడం కూడా కష్టంగా మారింది. దీంతో ఉన్న కొద్ది పాటి స్థలంలోనే చాలా మంది ఇళ్లు కట్టుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ఇల్లు ఒకటి బాగా వైరల్ అవుతోంది.
తమకంటూ ఓ స్వంత ఇల్లు (House) ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తమ స్తోమతకు తగినట్టు ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి వ్యక్తి కల. అది చిన్న ఇల్లు అయినా, తమ బడ్జెట్‌కు తగినట్లుగా ఇల్లు కట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ప్రస్తుతం నగరాల్లో స్థలం (House site) దొరకడమే గగనంగా మారిపోయింది. లక్షలు కుమ్మరిస్తే తప్ప సెంటు స్థలం దొరకడం కూడా కష్టంగా మారింది. దీంతో ఉన్న కొద్ది పాటి స్థలంలోనే చాలా మంది ఇళ్లు కట్టుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ఇల్లు ఒకటి బాగా వైరల్ అవుతోంది. కొద్దిపాటి స్థలంలో ఏకంగా నాలుగంతస్థుల భవనం (four-storey house) కట్టేశారు.
zindagi.gulzar.h అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ ఫొటోను షేర్ చేశారు. ``స్థలం చిన్నది కానీ, కలలు పెద్దవి`` అంటూ ఆ ఫొటోను పంచుకున్నారు. ఆ ఫొటో చూస్తే దాని యజమాని అభిరుచిని మెచ్చుకోకుండా ఉండలేం. అందుబాటులో ఉన్నకొద్ది పాటి స్థలంలోనే తనకు నచ్చినట్టుగా ఇంటిని కట్టుకున్నాడు. ఏకంగా నాలుగు అంతస్థులు నిర్మించాడు. ఒక్కో అంతస్థుకు ఒక్కో గది మాత్రమే వచ్చి ఉంటుంది. అయినా చూడడానికి అందంగా, నివసించడానికి సౌకర్యవంతంగా ఉంది. ఆ ఫొటో చూసిన చాలా మంది అతడిని మెచ్చుకుంటున్నారు.
ఈ వైరల్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను పది లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 1.5 లక్షల మంది కంటే ఎక్కువగా దీనిని లైక్ చేశారు. ఈ ఇంటిపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``కళ్లు చిన్నవిగా ఉన్నా, కలలు పెద్దవిగా ఉండాలి``, ``చాలా చక్కని ఇల్లు``, ``ఈ కలల ఇల్లు ప్యాలెస్ కంటే తక్కువేం కాదు``, ``అద్భుతంగా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇతడి టేస్ట్‌కు సలాం కొట్టాల్సిందే.. టీతో ఎవరైనా దానిని తింటారా? వీడియో చూస్తే..
Viral News: ఏడడుగులు వేసే ముందు బాత్రూమ్‌కు వెళ్లిన వధువు.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో..
Viral Video: అమ్మా.. వస్తున్నా ఆగు.. తల్లిపై సింహం పిల్ల ఎలా కోపం ప్రదర్శిస్తోందో చూడండి..
Brain Teaser Test: మీరు బాగా అనలైజ్ చేస్తారా? అయితే ఈ ముగ్గురిలో దొంగ ఎవరో 7 సెకెన్లలో గుర్తించండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి