Viral Video: కోట్లు విలువ చేసే కారు.. ఎడ్లబండి సహాయం లేకపోతే బయటకు రాలేకపోయింది.. వీడియో వైరల్..
ABN , Publish Date - Jan 01 , 2025 | 04:30 PM
కోట్ల విలువ చేసే లగ్జరీ ఫెరారీ కారు ఇసుకలో కూరుకుపోయింది. రాయగఢ్ బీచ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
కోట్ల రూపాయలు విలువ చేసే కారు.. వందల సీసీల సామర్థ్యం గల ఇంజిన్.. సెకెన్లలో వంద కిలోమీటర్ల వేగానికి చేరుకునే లగ్జరీ కారు.. అయినా ఆ కారుకు సహాయం చేసేందుకు ఎడ్లబండి (Bullock Cart) రాక తప్పింది కాదు.. కోట్ల విలువ చేసే లగ్జరీ ఫెరారీ కారు (Ferrari Car) ఇసుకలో కూరుకుపోయింది. రాయగఢ్ బీచ్ (Raigad Beach)లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు (Viral Video).
ముంబైకి చెందిన ఇద్దరు పర్యాటకులు తమ లగ్జరీ కారు ఫెరారీలో విహారయాత్రకు వెళ్లారు. రాయగఢ్‌లోని రెవ్‌దండా బీచ్‌కు చేరుకున్నారు. వాళ్లు అత్యుత్సాహంతో సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుకలోకి కారును పోనిచ్చార. అయితే ఆ కారు ఇసుకలో చిక్కుకుపోయింది. ఆ తర్వాత ఇసుక నుంచి తమ కారును బయటకు తీయలేక వారికి చెమటలు పట్టాయి. ఎంత తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కారు ఇంచు కూడా కదల లేదు. ఏం చేయాలో వారికి అంతు పట్టలేదు. అంతలో అటుగా వెళ్తున్న ఒక ఎద్దుల బండిని చూశారు.
ఇసుకలో కూరుకుపోయిన తమ కారును బయటకు తీయాలని ఎద్దుల బండి ఓనర్‌ని వేడుకున్నారు. ఫెరారీ కారు ముందుభాగాన్ని తాడుతో కట్టి ఎడ్లబండితో బయటకు లాగారు. అలా చేయడంతో లగ్జరీ కారు ఎట్టకేలకు ఇసుక నుంచి బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌గా మారింది. కోట్ల రూపాయలు విలువ చేసే కారును ఎడ్లబండితో బయటకు లాగించడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: కళ్లెదురుగానే మోసం.. యాపిల్స్ అమ్ముకునే వ్యక్తి ఎలా ఛీటింగ్ చేస్తున్నాడో చూస్తే..
IQ Test: ఈ ఆది మానవుల మధ్య ఒక ఆధునికుడు ఉన్నారు.. అది ఎవరో కనిపెడితే మీ బ్రెయిన్ సూపర్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..