Share News

Viral Video: ఇదెక్కడి వింత.. ఈ పంపు నీటినే కాదు.. నిప్పును కూడా వదులుతోంది.. కారణమేంటి?

ABN , Publish Date - Jan 21 , 2025 | 06:19 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యంతో బుర్ర తిరగడం ఖాయం. ఆ వీడియోలో కనిపిస్తున్న పంపు నుంచి నీరు మాత్రమే కాదు.. నిప్పు కూడా వస్తోంది. ఆ నిప్పు కాగితాలను మండిస్తోంది. ఆ వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు.

Viral Video: ఇదెక్కడి వింత.. ఈ పంపు నీటినే కాదు.. నిప్పును కూడా వదులుతోంది.. కారణమేంటి?
hand pump was spewing fire along with water

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు కొన్ని వింత వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. కొన్ని వీడియోలను చూస్తుంటే.. మన కళ్లు మనల్ని మోసం చేస్తున్నాయా? లేదా సైన్స్‌కు కూడా అందని రహస్యం ఏదైనా ఉందా? అనే అయోమయం వెంటాడుతుంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యంతో బుర్ర తిరగడం ఖాయం. ఆ వీడియోలో కనిపిస్తున్న పంపు (Hand Pump) నుంచి నీరు (Water) మాత్రమే కాదు.. నిప్పు (Fire) కూడా వస్తోంది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. shamir_roy అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ పంపు కనిపిస్తోంది. ఆ పంపు ద్వారా భూమి లోపలి నీరు బయటకు వస్తోంది. ఆ నీటితోనే కొందరు మహిళలు బట్టలు ఉతుకుతున్నారు. ఆ నీటితోనే ఓ వ్యక్తి మొహం కూడా కడుక్కున్నాడు. అదే సమయంలో ఇద్దరు యువకులు పైపు నుంచి వస్తున్న నీటితో కాగితాలను కాల్చారు. సాధారణ కాగితాలను ఆ పంపు దగ్గరకు తీసుకెళ్లిపెడితే వాటికి నిప్పు అంటుకుని కాలిపోతున్నాయి. మరోవైపు అదే నీటితో ఇతరులు తమ పనులను తాము చేసుకుంటున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. కొందరు దాని వెనుక గల కారణాలను చెబుతున్నారు.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 15 లక్షల మంది వీక్షించారు. 3.75 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది సోడియం కారణంగా జరుగుతోంది``, ``వారు ఆ పేపర్‌కు సోడియం లేదా పొటాషియం రాసినట్టు ఉన్నారు``, ``నీటి ప్రవాహ వేగం, పొటాషియం కలిసి కాగితాన్ని మండించగలవు``, ``నీటిలో కొన్ని రసాయనాలు ఉన్నాయి, అవి పేపర్‌కు తగిలిన తర్వాత మంటలు వస్తున్నాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఈ కుక్క చాలా డేంజర్.. తన ఢీకొన్న కారుపై ఎలా పగ తీర్చుకుంటోందో చూడండి..


Penguin Love Life: పెంగ్విన్‌లలో కూడా ప్రేమ, మోసం, విడాకులు.. వెలుగులోకి ఆశ్చర్యకర నిజాలు..


Brain Teaser Test: మీరు లాజికల్‌గా ఆలోచించగలరా?.. అయితే ఈ ఫొటోలో ఎన్ని సర్కిల్స్ ఉన్నాయో కనిపెట్టండి..



Anand Mahindra: ఎన్ని గంటలు పని చేశామన్నది కాదు.. 90 గంటల పని విధానంపై ఆనంద్ మహీంద్రా విసుర్లు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 21 , 2025 | 06:19 PM