Viral Business idea: బిజినెస్ ఐడియా అంటే ఇలా ఉండాలి.. కొన్ని రోజుల్లో అంబానీని దాటేస్తాడేమో..
ABN , Publish Date - Feb 04 , 2025 | 08:29 AM
శతకోటి సమస్యలకు అనంత కోటి ఉపాయాలు అంటారు. మన దేశవాసుల భద్రత కోసం ప్రభుత్వం ఎన్నో నిబంధనలను (Rules) పెడుతుంటుంది. గవర్నమెంట్ ఎన్ని రూల్స్ పెట్టినా పౌరులు మాత్రం వాటిని ఉల్లంఘించేందుకు కోటి దారులు వెతుకుంటారు.

శతకోటి సమస్యలకు అనంత కోటి ఉపాయాలు అంటారు. మన దేశవాసుల భద్రత కోసం ప్రభుత్వం ఎన్నో నిబంధనలను (Rules) పెడుతుంటుంది. గవర్నమెంట్ ఎన్ని రూల్స్ పెట్టినా పౌరులు మాత్రం వాటిని ఉల్లంఘించేందుకు కోటి దారులు వెతుకుంటారు. ముఖ్యంగా హెల్మెట్ (Helmet) విషయంలో బైకర్స్ ఉపయోగించే తెలివితేటలు మాత్రం అమోఘం అనే చెప్పాలి. చాలా మంది హెల్మెట్‌ను తమ భద్రత కోసం కాకుండా పోలీసుల కోసం పెట్టుకోవాలి అని భావిస్తుంటారు. అందువల్ల పోలీసులకు దొరకకుండా రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. (Viral Video)
ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో బైకర్స్ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలనే నిబంధన ఉంది. హెల్మెట్ లేని బైకర్లకు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ వేయకూడదని గవర్నమెంట్ నిబంధన విధించింది. ఆ రూల్‌ను ఓ వ్యక్తి తన బిజినెస్ ఐడియాగా మార్చుకున్నాడు. పెట్రోల్ బంక్ బయట కూర్చుని హెల్మెట్‌లను అద్దెకు ఇచ్చే బిజినెస్‌ను ప్రారంభించాడు (Helmets for Rent). ఒక్క హెల్మెట్‌ను ఐదు రూపాయలకు అద్దెకు ఇస్తున్నాడు. హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్‌కు వచ్చే వారు అతడికి ఐదు రూపాయలు ఇచ్చి హెల్మెట్ తీసుకుంటున్నారు. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత తిరిగి అతడికి హెల్మెట్ ఇచ్చేస్తున్నారు. అలా అతడు చాలా సులభంగా డబ్బులు సంపాదిస్తున్నాడు.
అతడి ఐడియాను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. రెండు లక్షల మంది ఆ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది సూపర్ బిజినెస్ ఐడియా``, ``అతడిని ఆపకపోతే అంబానీని దాటిపోతాడు``, ``ఇండియాలో తెలివితేటల స్థాయి అది``, ``రూల్స్‌ను అతిక్రమించడానికి అద్భుతమైన తెలివితేటలు వాడతారు``, ``మన దేశంలో నైతిక బాధ్యత అనేది ఎవరికీ ఉండదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: ఈ అడవిలో పాము ఎక్కడుంది.. మీ దృష్టి షార్ప్ అయితేనే 6 సెకెన్లలో కనిపెట్టగలరు..
Spider rain in Brazil: ఆకాశం నుంచి సాలెపురుగల వర్షం.. బ్రెజిల్‌లో వింత ఘటన.. కారణం ఏంటో తెలిస్తే..
Viral Video: తలుపు తెరవగానే మృత్యు దేవత.. వీడియో చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..
Viral Video: మృత్యువుకే వణుకు పుట్టిస్తున్నాడుగా.. ఈ వృద్ధుడు ఎలా చలి కాచుకుంటున్నాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి