Viral News: మహిళపై ఆగ్రహిస్తున్న నెటిజన్లు.. ఆమె చేసిన పని తెలిస్తే.. బాబోయ్..
ABN , Publish Date - Apr 16 , 2025 | 07:37 PM
వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిత్యం కష్టపడుతుంటారు ట్రాఫిక్ పోలీసులు. ఎక్కడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సిగ్నల్స్‌ను మేనేజ్ చేస్తుంటారు. అలాంటి వారికి కొంతమంది అప్పుడప్పుడూ చుక్కలు చూపిస్తుంటారు.
మహారాష్ట్ర: ట్రాఫిక్ పోలీసుల కష్టాలు అన్నీఇన్ని కాదు. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలమనే తేడా లేకుండా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ పని చేస్తుంటారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిత్యం కష్టపడుతుంటారు. ఎక్కడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సిగ్నల్స్‌ను మేనేజ్ చేస్తుంటారు. అలాంటి ట్రాఫిక్ పోలీసులకు కొంతమంది అప్పుడప్పుడూ చుక్కలు చూపిస్తుంటారు. మద్యం తాగి అజాగ్రత్తగా వాహనాలు నడుపుతూ అడ్డంగా పట్టుపడినప్పుడు పోలీసులకే సవాల్ చేస్తుంటారు. మరికొంతమంది మాకు వారు తెలుసు, వీరు తెలుసంటూ బెదిరించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకొంతమంది అతిగా ప్రవర్తిస్తూ వాహనాలతో పోలీసులనే ఢీకొడుతుంటారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
తాజాగా ట్రాఫిక్ పోలీసును ఓ మహిళ తన కారుతో ఢీకొట్టిన వీడియో ఒక్కటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కాని.. సదరు మహిళను ట్రాఫిక్ పోలీస్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమె ఏదో తప్పు చేయడంతో నిలువరించేందుకు యత్నించారు. అయినా ఆమె వెళ్లేందుకే సిద్ధమవడంతో కారు ముందుకు వెళ్లకుండా ఎదురుగా నిల్చున్నారు కానిస్టేబుల్. అయితే ఆయన ఎదురుగా ఉన్నా సరే కారును ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేసింది ఆ మహిళ. ఎక్స్‌లేటర్ పెంచుతూ అతని కాళ్లను ఢీకొట్టింది. అలా పలుమార్లు చేస్తూ ముందుకు వెళ్లేందుకు ట్రై చేసింది. దీంతో సదరు కానిస్టేబుల్ వీడియో తీయాల్సిందిగా అక్కడున్న యువకులను కోరారు. అయినా ఆమె మాత్రం తగ్గదేలే అన్నట్లు వ్యవహరించింది. ఇంతలో అక్కడికి వచ్చిన మరో పోలీస్ అధికారి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ వీడియో ముగిస్తుంది.
ఈ వీడియోను యువకులు ఏప్రిల్ 15న సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గంటల వ్యవధిలోనే అది కాస్త వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు మహిళ తీరుపై మండిపడుతున్నారు. తప్పు చేస్తే అడ్డుకున్నందుకు ఢీకొట్టేందుకు ప్రయత్నిస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. రహదారిపై ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తన ఏంటని ఆగ్రహిస్తున్నారు. ఇలాంటి వారిని ఆగడాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అవసరమని అంటున్నారు. ఆమెను వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. కాగా, తరచూ ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
IAS Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్‍కు నోటీసులు.. విషయం ఏంటంటే..
Poisoning In School: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలనం రేపుతున్న ఘటన..
Chandanotsavam 2025: సింహాచలానికి సీఎం చంద్రబాబు వచ్చేది ఆ రోజే: మంత్రి ఆనం..