Share News

Shocking Wedding Night: అన్న ఫస్ట్ నైట్ రూమ్‍లో తమ్ముడు.. ఇద్దెక్కడి పిచ్చిరా బాబు..

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:34 PM

ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్నాడు ఓ యువకుడు. బంధుమిత్రులను పిలుచుకుని అత్యంత ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. వివాహానికి వచ్చిన బంధువులంతా మంచిగా భోజనం చేసి అనంతరం డీజేల వద్ద హంగామా చేశారు.

Shocking Wedding Night: అన్న ఫస్ట్ నైట్ రూమ్‍లో తమ్ముడు.. ఇద్దెక్కడి పిచ్చిరా బాబు..

ఇంటర్నెట్ డెస్క్: వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఆ రోజు కోసం యువతీయువకులు ఎన్నో కలలు కంటుంటారు. పెళ్లి కుదిరిందంటే చాలు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు. తాళి కట్టే రోజు కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అయితే అలాగే కలలు కన్న ఓ యువకుడికి బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా వివాహం అయ్యింది. అనంతరం ఫస్ట్ నైట్ కోసం వధూవరులు అదే రోజు రాత్రి రూమ్‌లోకి వెళ్లారు. తీరా అక్కడ కనిపించింది చూసి షాక్ అయ్యారు.


ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్నాడు ఓ యువకుడు. బంధుమిత్రులను పిలుచుకుని అత్యంత ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. వివాహానికి వచ్చిన బంధువులంతా మంచిగా భోజనం చేసి అనంతరం డీజేల వద్ద హంగామా చేశారు. ఆ తర్వాత అందరూ తమతమ ఊర్లకు వెళ్లిపోయారు. ఇక, నూతన వధూవరులిద్దరూ తమ శోభనం కోసం సిద్ధమయ్యారు. ఇరు కుటుంబాల వారంతా నూతన దంపతులను గదిలోకి పంపించారు. లోపలికి వెళ్లిన వారిద్దరూ సిగ్గుపడుతూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.


అయితే తమను ఎవరో గమనిస్తున్నారని, వారికి అనుమానం వచ్చింది. దీంతో రూమ్‌లో వెతకడం మెుదలుపెట్టారు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి అవాక్కయ్యారు. శోభనం గదిలో దంపతులిద్దరికీ సీసీ కెమెరాలు కనిపించాయి. తాము కలిసున్నప్పుడు చిత్రీకరించేందుకు వాటిని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఆ కాసేపటికే అటకపై ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. మంచంపైకి ఎక్కి చూడగా.. పెళ్లి కొడుకు తమ్ముడు అక్కడ కనిపించాడు. దీంతో అన్నావదిన ఇద్దరూ కంగుతిన్నారు. వెంటనే కేకలు వేయడం ప్రారంభించారు.


ఇరువర్గాల కుటుంబసభ్యులు సైతం లోపలికి వచ్చేశారు. అక్కడ వరుడు సోదరుడు ఉండడంతో చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే సీసీ కెమెరాలు పెట్టినట్లు నిందితుడు తెలిపాడు. అలాగే తాను నేరుగా చూడాలని గదిలో దాక్కున్నట్లు చెప్పాడు. అతని చెప్పిన మాటలకు పోలీసులు సైతం అవాక్కయ్యారు. కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

IAS Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్‍కు నోటీసులు.. విషయం ఏంటంటే..

Poisoning In School: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలనం రేపుతున్న ఘటన..

Chandanotsavam 2025: సింహాచలానికి సీఎం చంద్రబాబు వచ్చేది ఆ రోజే: మంత్రి ఆనం..

Updated Date - Apr 16 , 2025 | 05:37 PM