Share News

Gabba Stadium: క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. గబ్బా స్టేడియం కూల్చివేత

ABN , Publish Date - Mar 26 , 2025 | 07:55 AM

వందేళ్లకు పైగా చరిత్ర కలిగి.. ఎన్నో అద్భుతమైన మ్యాచ్‌లకు వేదికగా నిలిచిన గబ్బా స్టేడియాన్ని కూల్చి వేసేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వార్త క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.

Gabba Stadium: క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. గబ్బా స్టేడియం కూల్చివేత
Gabba Stadium

క్రికెట్‌కు సంబంధించి ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి గాంచిన స్టేడియాల్లో ఆస్ట్రేలియాలోని గబ్బా స్టేడియం ఒకటి. దీనికి సుమారు వంద ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఎన్నో ప్రతిష్టాత్మక మ్యాచ్‌లకు వేదికగా నిల్చిన ఈ స్టేడియం త్వరలో మట్టిలో కలిసిపోనుంది. త్వరలోనే గబ్బా స్టేడియాన్ని కూల్చి వేయనున్నారు. ఈ వార్త క్రికెట్ అభిమానులను కుదిపేస్తుంది. మరి ప్రభుత్వం ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే..


ఆస్ట్రేలియాలోని అత్యంత ప్రసిద్ధి చెందిన బ్రిస్బేన్ గబ్బా స్టేడియం కనుమరుగు కానుంది. 2032 ఒలింపిక్ క్రీడల తర్వాత ఈ స్టేడియాన్ని పూర్తిగా కూల్చివేయాలని క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. గబ్బా స్టేడియం నిర్మించి సుమారు వందేళ్లకుపైగా అయ్యిందని.. ఈ క్రమంలో స్టేడియం పునర్నిర్మాణ ఖర్చులు భారీగా పెరుగుతుండటంతో.. దాన్ని పూర్తిగా కూల్చి వేసి.. కొత్త స్టేడియం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.


క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం.. 2032 ఒలింపిక్ క్రీడలకు అతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం కొత్తగా ఆధునిక మైదానాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే గబ్బా స్టేడియంను పూర్తిగా కూల్చివేసి.. దాని స్థానంలో విక్టోరియా పార్క్‌లో సుమారు 63 వేల మంది ప్రేక్షకుల సామార్థ్యంతో అత్యాధునిక స్టేడియాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

క్రికెట్ ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం గబ్బా మైదానంలో మౌలిక సదుపాయాలు పూర్తిగా పాతబడిపోయాయని గుర్తించాయి. స్టేడియం పునరుద్ధరణకు భారీ ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తుంది. దాని కన్నా కొత్త స్టేడియం నిర్మించడం ఉత్తమమని ప్రభుత్వం భావించి.. గబ్బా కూల్చివేతకు నిర్ణయం తీసుకుంది.


గబ్బా స్టేడియం పూర్తిగా మూతపడేవరకు అక్కడ కొన్ని ముఖ్యమైన ఈవెంట్లు నిర్వహించనున్నారు. వీటిల్లో 2025 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో జరగబోయే 2వ మ్యాచ్, అలానే 2032 ఒలింపిక్స్‌లో కొన్ని పోటీలు, గోల్డ్ మెడల్ పతక మ్యాచ్‌లు, వేసవిలో జరిగే కొన్ని వైట్‌బాల్ క్రికెట్ మ్యాచ్‌లు గబ్బలోే జరగనున్నాయి. ఇక గబ్బా స్టేడియం కూల్చివేత, కొత్త దాని నిర్మాణం కోసం ప్రభుత్వం 2.7 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు కేటాయించింది. అయితే ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడాన్ని అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దాంతో క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం ముందుగా ప్రకటించిన ప్లాన్‌ను సవరించింది. ప్రారంబంలో గబ్బా స్టేడియం పునరుద్ధణ కోసం 600 మిలియన్ ఆస్ట్రలియన్ డాలర్లను ఖర్చు చేయాలని భావించింది. తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కొత్త విక్టోరియా పార్క్ స్టేడియం ప్రాజెక్ట్‌ను ఆమోదించింది.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ వెనుక ఇంత రహస్యం దాగి ఉందా

రిషభ్ పంత్ చేసిన ఆ తప్పు.. ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చిందంటే..

Updated Date - Mar 26 , 2025 | 08:00 AM