IPL 2025: RCB vs KKR ఫస్ట్ ఫైట్.. ప్లేయింగ్ 11 రివీల్డ్
ABN , Publish Date - Mar 22 , 2025 | 10:54 AM
IPL 2025 KKR vs RCB Playing XI: ఐపీఎల్ 18వ సీజన్ మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. మెగా లీగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఇక జట్లు బరిలోకి దిగి కొట్లాడటమే మిగిలింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఫైట్‌లో తలపడుతున్న ఆర్సీబీ-కేకేఆర్ ప్లేయింగ్ ఎలెవన్స్ ఎలా ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..

నెలన్నర పాటు క్రికెట్ లవర్స్‌కు మస్తు వినోదం పంచేందుకు సిద్ధమైపోయింది ఐపీఎల్. ఇవాళ్టి నుంచే క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్ స్టార్ట్ కానుంది. ఫస్ట్ ఫైట్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, పాపులర్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఆరంభ మ్యాచ్‌లోనే బోణీ కొట్టి సక్సెస్ ట్రాక్‌ను ఎక్కాలని రెండు జట్లూ పంతంతో ఉన్నాయి. మంచి స్టార్ట్‌తో కాన్ఫిడెన్స్‌ను నింపుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీ ఓపెనర్‌లో ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్స్ ఎలా ఉండనున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం..
బెంగళూరు ఇలా..
ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్‌ను కోహ్లీ ముందుండి నడిపించనున్నాడు. అతడితో కలసి ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేయడం ఖాయం. కెప్టెన్ రజత్ పాటిదార్ ఎప్పటిలాగే నంబర్ 3లో బ్యాటింగ్‌కు దిగుతాడు. ఆ తర్వాత లివింగ్‌స్టన్, జితేశ్ శర్మ ఆడతారు. ఆల్‌రౌండర్లు టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా ఫినిషింగ్ బాధ్యతల్ని తీసుకుంటారు. యశ్ దయాల్‌తో కలసి హేజల్‌వుడ్, భువనేశ్వర్ పేస్ రెస్పాన్సిబిలిటీస్‌ను పంచుకుంటారు. సుయాష్ శర్మ ప్రధాన స్పిన్నర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. సిచ్యువేషన్స్‌ను బట్టి స్వప్నిల్ సింగ్, రసీఖ్ సలాం, దేవ్‌దత్ పడిక్కల్‌లో ఒకరు ఇంపాక్ట్ సబ్‌గా ఆడతారు.
కోల్‌కతా అలా..
కేకేఆర్ టీమ్‌లో డికాక్, నరైన్ ఓపెనింగ్ చేసే చాన్స్ ఉంది. కెప్టెన్ రహానె మూడో నంబర్ లేదా ఐదో నంబర్‌లో ఆడొచ్చు. వెంకీ అయ్యర్, రింకూ సింగ్ ప్లేసెస్ సిచ్యువేషన్‌ను బట్టి మారొచ్చు. రస్సెల్, రమణ్‌దీప్ ఫినిషర్లుగా వ్యవహరించే అవకాశం ఉంది. హర్షిత్ రానా, నోర్జే, వైభవ్ అరోరా పేస్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటారు. వరుణ్ చక్రవర్తి ప్రధాన స్పిన్నర్‌గా బరిలోకి దిగుతాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి గుర్బాజ్, మొయిన్ అలీ, స్పెన్సర్ జాన్సన్‌లో ఒకర్ని ఇంపాక్ట్ సబ్‌గా తీసుకోవచ్చు.
ఆర్సీబీ జట్టు (అంచనా)
విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), రజత్ పాటిదార్ (సారథి), లియామ్ లివింగ్‌స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, జోష్ హేజల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, సుయాష్ శర్మ.
ఇంపాక్ట్ ప్లేయర్: రసీఖ్ సలాం లేదా దేవ్‌దత్ పడిక్కల్.
కేకేఆర్ జట్టు (అంచనా)
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానె (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, అన్రిచ్ నోర్జే, వైభవ్ అరోరా.
ఇంపాక్ట్ ప్లేయర్: రెహ్మానుల్లా గుర్బాజ్ లేదా స్పెన్సర్ జాన్సన్.
ఇవీ చదవండి:
ఫిక్సింగ్ బ్యాటింగ్ మాఫియా కుట్రా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి