Ajinkya Rahane IPL 2025: రహానేకు అవమానం.. కెప్టెన్ అని కూడా చూడకుండా..
ABN , Publish Date - Mar 26 , 2025 | 01:46 PM
KKR vs RR IPL 2025: కోల్‌కతా నైట్ రైడర్స్ సారథి అజింక్యా రహానేకు అవమానం ఎదురైంది. అతడు జట్టు సారథి అనేది కూడా పట్టించుకోకుండా పిచ్ క్యూరేటర్ బిహేవ్ చేసిన తీరు చర్చనీయాంశంగా మారింది.

పిచ్ క్యూరేటర్లతో కెప్టెన్స్, టీమ్ మేనేజ్‌మెంట్స్ మాటామంతీ జరపడం క్రికెట్‌లో మామూలే. ముఖ్యంగా హోమ్ టీమ్స్ తమ కాంబినేషన్స్, బలాబలాలను బట్టి పిచ్‌లో మార్పుచేర్పులు చేయాల్సిందిగా పిచ్ క్యూరేటర్స్‌ను రిక్వెస్ట్ చేయడం చూస్తుంటాం. అందుకు కొన్నిసార్లు పిచ్ క్యూరేటర్లు ఓకే చెప్పినా.. మరికొన్ని సార్లు నో చెబుతుంటారు. నిబంధనలను బట్టి వ్యవహరిస్తుంటారు. అయితే పిచ్ క్యూరేటర్లకు టీమ్స్ లేదా కెప్టెన్స్‌తో గొడవైన సందర్భాలు పెద్దగా లేవు. కానీ ఐపీఎల్-2025లో మాత్రం కొత్త రగడ మొదలైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ కొత్త కెప్టెన్ అజింక్యా రహానేకు అవమానం ఎదురైంది. ఆయన మాటల్ని పిచ్ క్యూరేటర్ వినకపోగా.. నచ్చినట్లు చేస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈడెన్ గార్డెన్స్‌లో ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..
రహానె కోరినా..
డిఫెండింగ్ చాంపియన్ అయిన కేకేఆర్.. ఈ సీజన్ ఓపెనర్‌లో ఆర్సీబీ చేతుల్లో 7 వికెట్ల తేడాతో చిత్తయింది. దీంతో మ్యాచ్ అనంతరం కెప్టెన్ రహానె మాట్లాడుతూ.. ఈడెన్ పిచ్ నుంచి స్పిన్నరకు మద్దతు లభిస్తే బాగుంటుందని అన్నాడు. పిచ్‌ను ఒకటిన్నర రోజు పాటు కప్పేసి ఉంచారని సీరియస్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ రూపంలో క్వాలిటీ స్పిన్నర్లు తమ టీమ్‌లో ఉన్నారని.. పిచ్‌ను స్పిన్ ఫ్రెండ్లీగా మారిస్తే కేకేఆర్‌కు లాభం చేకూరుతుందని అన్నాడు. అయితే అతడి సూచనను పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తోసిపుచ్చాడు. ఇలాంటి రిక్వెస్ట్‌లు పట్టించుకునేది లేదన్నాడు.
ఇలాగే ఉంటది
కేకేఆర్ ఆడిన పిచ్ మీదే ప్రత్యర్థి ఆర్సీబీ కూడా ఆడిందని.. ఆ టీమ్ స్పిన్నర్లు 4 వికెట్లు తీశారని ఈడెన్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ అన్నాడు. అక్కడితో ఆగని ఆయన.. తాను క్యూరేటర్‌గా ఉన్నంత వరకు ఈడెన్ పిచ్ మారబోదని, ఇలాగే ఉంటుందని స్పష్టం చేశాడు. ఐపీఎల్ రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం.. పిచ్‌ల మార్పు అంశం అనేది ఫ్రాంచైజీల పరిధిలో లేదని క్లారిటీ ఇచ్చాడు. తాను పిచ్ క్యూరేటర్‌గా వచ్చినప్పటి నుంచి ఈడెన్ పిచ్ ఇలాగే ఉందని, ఇక మీదటా ఇలాగే ఉంటుందని ముఖర్జీ వ్యాఖ్యానించాడు. కాగా, ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. రహానె స్థాయి సీనియర్ ప్లేయర్ అడిగినప్పుడు మార్చకపోయినా ఫర్వాలేదని.. కానీ తాను ఉన్నంత వరకు పిచ్ మారదంటూ సీరియస్ కామెంట్స్ చేయడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇది రహానేను అవమానించినట్లేనని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
ఉప్పల్‌లో కొడితే బోడుప్పల్‌లో పడాలె
ప్లీజ్.. రోహిత్‌ను ఏమీ అనొద్దు: సిరాజ్
కావాలనే సెంచరీ మిస్.. అయ్యర్‌కు హ్యాట్సాఫ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి