KKR vs SRH Match Prediction: కేకేఆర్‌తో కీలక మ్యాచ్.. సన్‌రైజర్స్ గెలుపు దాహం తీరేనా..
ABN , Publish Date - Apr 03 , 2025 | 01:20 PM
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చావోరేవో అనే పోరాటానికి సిద్ధమవుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఫైట్‌లో అమీతుమీ తేల్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ టగ్ ఆఫ్ వార్‌లో విజయం ఎవరిదో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్-2025లో ఇవాళ టగ్ ఆఫ్ వార్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య కీలక పోరుకు సర్వం సిద్ధమైంది. రెండు జట్లు పరాజయాల బారి నుంచి బయటపడాలని చూస్తుండటంతో ఇవాళ్టి మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు సక్సెస్ ట్రాక్ గనుక ఎక్కకపోతే సీజన్‌లో వెనుకపడే ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడా ఓడితే తిరిగి బౌన్స్ బ్యాక్ ఇవ్వడం చాలా కష్టం. అందుకే ఈడెన్‌లో విజయఢంకా మోగించాలని అటు కేకేఆర్, ఇటు ఎస్‌ఆర్‌హెచ్ రెండూ పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లలో విజయం ఎవరిదనేది ఇప్పుడు చూద్దాం..
బలాలు
కేకేఆర్: ఈ జట్టులో సాలిడ్ బ్యాటర్లతో పాటు క్వాలిటీ ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఓపెనర్ డికాక్ రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 97 పరుగులు అద్వితీయ ఇన్నింగ్స్ ఆడాడు. నరైన్, రస్సెల్ రూపంలో బ్యాటింగ్, బౌలింగ్.. రెండింటా ప్రతిభ చూపే ఆల్‌రౌండర్లు ఉన్నారు. బౌలింగ్ అటాక్‌లో వరుణ్ చక్రవర్తి ప్రధాన ఆయుధమని చెప్పాలి.
ఎస్‌ఆర్‌హెచ్: సన్‌రైజర్స్ స్ట్రెంగ్త్ బ్యాటింగే. అభిషేక్ దగ్గర నుంచి అనికేత్ వర్మ వరకు సూపర్బ్ బ్యాటర్లు టీమ్‌లో ఉన్నారు. ఏ ముగ్గురు సక్సెస్ అయినా టీమ్ ఈజీగా 200 ప్లస్ స్కోరు సెట్ చేస్తుంది. గత సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో అదరగొట్టిన క్లాసెన్ నుంచి సేమ్ ఇన్నింగ్స్ కోరుకుంటున్నారు అభిమానులు. బౌలింగ్‌లో కొత్త స్పిన్నర్ జీషన్ అన్సారీ అద్భుతంగా రాణిస్తున్నాడు.
బలహీనత
కేకేఆర్: వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, మనీష్ పాండే బ్యాటింగ్‌లో విఫలమవుతుండటం కోల్‌కతాకు బిగ్ మైనస్‌గా మారింది. రస్సెల్ బ్యాట్ కూడా మోగట్లేదు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి ఒక్కడే నిలకడగా వికెట్లు తీస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ వీక్‌నెస్‌లు అధిగమించకపోతే టీమ్‌కు కష్టమే.
ఎస్‌ఆర్‌హెచ్: బ్యాటర్లు నిలకడగా పరుగులు చేయలేకపోతున్నారు. ముఖ్యంగా నితీష్ రెడ్డి టచ్‌లోకి రాకపోవడం టీమ్‌కు మైనస్‌గా మారింది. క్లాసెన్, హెడ్ నుంచి కూడా భారీ ఇన్నింగ్స్‌లు బాకీ ఉన్నాయి. బౌలింగ్‌లో షమి దారుణంగా విఫలమవుతున్నాడు. హర్షల్ పటేల్ వికెట్లు తీయలేకపోతున్నాడు. కమిన్స్ కూడా బ్రేక్‌త్రూ అందించలేకపోతున్నాడు.
హెడ్ టు హెడ్: ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 27 మ్యాచులు జరిగాయి. ఇందులో 18 మ్యాచుల్లో కేకేఆర్, 9 మ్యాచుల్లో సన్‌రైజర్స్ నెగ్గాయి.
విన్నింగ్ ప్రిడిక్షన్: హెడ్ టు హెడ్ రికార్డుల పరంగా కేకేఆర్‌ది పైచేయిగా ఉంది. కానీ స్ట్రాంగ్ బ్యాటింగ్ పవర్, సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్ రిజల్ట్‌ను శాసించే హిట్టర్లు ఎక్కువగా ఉన్నందున ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలుపు ఖాయం.
ఇవీ చదవండి:
కొత్త గర్ల్‌ఫ్రెండ్ గురించి చెప్పేసిన ధవన్
స్టార్ యాక్టర్‌పై కోహ్లీ ఫ్యాన్స్ సీరియస్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి