Share News

Women Weightlifter: అయ్యో పాపం.. 17 ఏళ్ల వెయిట్ లిఫ్టర్.. 270 కిలోలు ఎత్తబోయి..

ABN , Publish Date - Feb 19 , 2025 | 07:04 PM

National Level Women Weightlifter: నిర్లక్ష్యం ఎంతవరకు దారితీస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఘటన చాలు. ట్రైనర్‌ను నమ్మినందుకు పాపం ఓ వెయిట్ లిఫ్టర్ ప్రాణాలు పోగొట్టుకుంది.

Women Weightlifter: అయ్యో పాపం.. 17 ఏళ్ల వెయిట్ లిఫ్టర్.. 270 కిలోలు ఎత్తబోయి..
Women Weightlifter

వెయిట్ లిఫ్టర్‌గా ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. జూనియర్ నేషనల్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు రేపిందా అమ్మాయి. విశ్వక్రీడల్లో భారత్‌కు ఆడి దేశానికి పతకాలు తీసుకురావాలని అనుకుంది. ఆమె ఆట చూసిన జనాలు కూడా ఇది నిజం అవుతుందని నమ్మారు. కానీ ఒక నిర్లక్ష్యం ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. దేశ కీర్తిప్రతిష్టల్ని మరింత ఇనుమడింపజేయాలని అనుకున్న ఆమె ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది. రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగిన ఓ ఘటన క్రీడా లోకాన్ని కలవరానికి గురిచేసింది. ట్రైనర్ నిర్లక్ష్యానికి యషికా ఆచార్య అనే యువ పవర్‌లిఫ్టర్ బలైంది. శిక్షణ సమయంలో జరిగిన తప్పిదంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గురించి మరింతగా తెలుసుకుందాం..


ఒక్కసారిగా మీద పడటంతో..

బికనేర్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. యషికా అనే యువ పవర్‌లిఫ్టర్ జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది. 270 కిలోల బరువును ఎత్తే ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోయింది యషికా. ఆమె కాళ్లు సమతూకం తప్పిన సమయంలోనే స్క్వాట్ రాడ్ కూడా జారడం మొదలైంది. దీంతో కింద పడింది యషికా. ఒక్కసారిగా అంత బరువూ ఆమె మెడ మీద పడింది. దీంతో మెడ విరిగింది. ఆమె వెనకాలే ట్రైనర్, పక్కనే ఇతర లిఫ్టర్లు కూడా ఉన్నా ఏమీ చేయలేకపోయారు. ఆమె మెడ తగిలి ట్రైనర్ గాయపడటాన్ని వీడియోలో చూడొచ్చు. అతడి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణాలు పోయాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. యువ పవర్‌లిఫ్టర్ అనూహ్య మృతిపై అనేక మంది క్రీడా ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.


ఇవీ చదవండి:

కింద కివీస్ ఆటగాళ్లు.. మీదుగా విమానాలు.. స్టేడియంలో అంతా షాక్

పాక్‌ను చితగ్గొట్టిన కివీస్ బ్యాటర్

అందరి నోటా ఒకటే మాట.. ఆ టీమ్‌దే కప్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 19 , 2025 | 07:10 PM