Share News

Nitish Kumar Reddy: సెలెక్టర్లను కన్‌ఫ్యూజ్ చేస్తున్న నితీష్ రెడ్డి.. భలే ట్విస్ట్ ఇచ్చాడు

ABN , Publish Date - Jan 08 , 2025 | 03:17 PM

ఆస్ట్రేలియా సిరీస్‌ టీమిండియాకు పీడకలగా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్లు బీజీటీలో పూర్ పెర్ఫార్మెన్స్‌తో తీవ్ర విమర్శల పాలయ్యారు. హిట్‌మ్యాన్ అయితే సిరీస్ లాస్ట్ టెస్ట్‌లో బెంచ్ మీద కూర్చున్నాడు. అయితే ఆ టూర్‌లో భారత్‌కు కొన్ని సానుకూలాంశాలు కూడా ఉన్నాయి. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆణిముత్యం భారత క్రికెట్‌కు లభించాడు.

Nitish Kumar Reddy: సెలెక్టర్లను కన్‌ఫ్యూజ్ చేస్తున్న నితీష్ రెడ్డి.. భలే ట్విస్ట్ ఇచ్చాడు
Nitish Kumar Reddy

ఆస్ట్రేలియా సిరీస్‌ టీమిండియాకు పీడకలగా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్లు బీజీటీలో పూర్ పెర్ఫార్మెన్స్‌తో తీవ్ర విమర్శల పాలయ్యారు. హిట్‌మ్యాన్ అయితే సిరీస్ లాస్ట్ టెస్ట్‌లో బెంచ్ మీద కూర్చున్నాడు. అయితే ఆ టూర్‌లో భారత్‌కు కొన్ని సానుకూలాంశాలు కూడా ఉన్నాయి. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆణిముత్యం భారత క్రికెట్‌కు దొరికింది కంగారూ సిరీస్‌తోనే. ఆ సిరీస్‌లో 298 పరుగులతో రాణించాడు నితీష్. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ నుంచి అత్యధిక పరుగులు చేసింది తెలుగోడే కావడం గమనార్హం. బంతితోనూ 5 వికెట్లు తీసి మెరిశాడు. అవసరమైన సమయంలో బ్రేక్‌త్రూలు తీస్తూ తనలో నిఖార్సయిన పేస్ ఆల్‌రౌండర్ దాగి ఉన్నాడని నిరూపించాడు. అయితే భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్న నితీష్ రెడ్డి.. సెలెక్టర్లను మాత్రం కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేశాడు. అసలేం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం..


వాళ్ల కంటే నితీష్ బెటర్!

టెస్టుల్లోనే కాదు.. వన్డేలు, టీ20 స్క్వాడ్స్‌లోనూ తనకు చోటు ఇవ్వక తప్పదని పెర్ఫార్మెన్స్‌తో చెప్పకనే చెప్పాడు నితీష్ రెడ్డి. అయితే వైట్‌బాల్ క్రికెట్‌లో ఆల్రెడీ హార్దిక్ పాండ్యా రూపంలో సాలిడ్ పేస్ ఆల్‌రౌండర్ ఉన్నాడు. అతడ్ని కాదని నితీష్‌ను తీసుకోలేరు. కానీ గాయాలతో సావాసం చేసే హార్దిక్‌కు బ్యాకప్ ఉండాలి. కాబట్టి నితీష్‌ను ఎంపిక చేయొచ్చు. అయితే గత కొన్నేళ్లలో టీమిండియా ఎక్కువగా స్పిన్ ఆల్‌రౌండర్లతోనే ట్రావెల్ అవడం చూస్తున్నాం. ఇప్పుడు కూడా జట్టులో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లాంటి క్వాలిటీ స్పిన్ ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. అయితే వీళ్లు ఆసీస్ టూర్‌లో అంతంత మాత్రంగానే ఆడారు.


బిగ్ చాలెంజ్!

బీజీటీ సిరీస్‌లో బ్యాట్‌తో 135 పరుగులు చేసిన జడేజా.. బంతితో 4 వికెట్లు మాత్రమే తీశాడు. ఇక, సుందర్ 6 ఇన్నింగ్స్‌ల్లో 114 పరుగులు చేసి.. 3 వికెట్లు పడగొట్టాడు. వీళ్లిద్దరితో పోలిస్తే నితీష్ రెడ్డి పరుగులు, వికెట్ల పరంగా చాలా ఎత్తులో ఉన్నాడు. కాబట్టి రెడ్ బాల్ స్క్వాడ్స్‌తో పాటు వన్డే, టీ20 జట్టలోనూ అతడ్నే ఆడించాలనే డిమాండ్లు వస్తున్నాయి. వచ్చే నెలలో జరిగే చాంపియన్స్ ట్రోఫీలోనూ తెలుగోడ్ని సెలెక్ట్ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే భారత మ్యాచులకు ఆతిథ్యం ఇస్తున్న దుబాయ్ పిచ్‌లు ఎక్కువగా స్పిన్‌కు మద్దతుగా ఉంటాయి. అందునా టీమిండియా వన్డే జట్టు రాడార్‌లో నితీష్ లేడు. ఈ నేపథ్యంలో సుందర్, జడేజాను కాదని.. నితీష్‌ను తీసుకోవడం సెలెక్టర్లకు కత్తి మీద సామే. అయితే కెరీర్ ఆరంభమే కాబట్టి అతడి విషయంలో తొందరపడకుండా మరింత బెటర్ ఆల్‌రౌండర్‌ అయ్యాక త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా చేసే అవకాశం కూడా ఉంటుంది.


ఇవీ చదవండి:

అడ్డంగా బుక్కైన పాకిస్థాన్.. ఉన్న కాస్త పరువూ పోయింది

లాంగ్ బ్రేక్ తీసుకుంటున్న టీమిండియా స్టార్.. అప్పటిదాకా నో క్రికెట్

ఆ స్టార్లను సౌతాఫ్రికా పంపండి.. బీసీసీఐకి డివిలియర్స్ రిక్వెస్ట్..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 08 , 2025 | 03:18 PM