Share News

PAK vs NZ: పాక్ ప్లేయర్ పిల్ల చేష్టలు.. ఇక వీళ్లు మారరా..

ABN , Publish Date - Mar 19 , 2025 | 01:08 PM

Shadab Khan: పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ పిల్ల చేష్టలతో పరువు తీసుకున్నాడు. ఒకవైపు అవతలి జట్టులోని బ్యాటర్లు ఫోర్లు, సిక్సులతో విధ్వంసం సృష్టిస్తుంటే.. మరోవైపు షాదాబ్ మాత్రం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించాడు.

PAK vs NZ: పాక్ ప్లేయర్ పిల్ల చేష్టలు.. ఇక వీళ్లు మారరా..
Pakistan vs New Zealand

క్రికెట్‌లో ఇతర జట్ల కంటే పాకిస్థాన్ చాలా డిఫరెంట్. ఆ టీమ్ ప్లేయర్లు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. మ్యాచులు ఓడుతుంటే సంబురాలు చేసుకోవడం, ప్రత్యర్థి ఆటగాళ్లను టీజ్ చేయడం వాళ్లకు అలవాటు. ఒక్కోసారి వాళ్లలో వాళ్లే గొడవలు పడి పరువు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మిస్ ఫీల్డింగ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవడం కూడా చూసే ఉంటారు. ఇప్పుడు మరోమారు పాక్ టీమ్ వార్తల్లోకి ఎక్కింది. ఆ టీమ్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ పిల్ల చేష్టలతో పరువు తీసుకున్నాడు. ఇంతకీ అతడేం చేశాడు అనేది ఇప్పుడు చూద్దాం..


పిల్లల్ని ఆటపట్టించడంతో..

న్యూజిలాండ్‌తో రెండో టీ20లోనూ ఓడింది పాకిస్థాన్. వరుసగా రెండో పరాజయంతో 5 మ్యాచుల సిరీస్‌లో 0-2తో వెనుకబడింది. ఆ టీమ్ సంధించిన 135 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఆడుతూ పాడుతూ ఛేజ్ చేసింది. 13.1 ఓవర్లలోనే మ్యాచ్ ముగించింది. అయితే న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో పిల్ల చేష్టలతో వైరల్ అయ్యాడు షాదాబ్ ఖాన్. అలెన్ కొట్టిన బంతి సిక్స్‌కు వెళ్లగా.. దాని కోసం పరిగెత్తాడు షాదాబ్. అయితే బౌండరీ రోప్‌లో పడిన బంతిని తీసుకొస్తుండగా.. అక్కడే ఉన్న కొందరు పిల్లలు అది కావాలని అడగడంతో వారిని ఆటపట్టించాడు. పిల్లల చేతికి బంతిని ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి తీసుకున్నాడు షాదాబ్. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. గెలవడం చేతగాదు గానీ ఇలాంటి పిల్ల చేష్టలకు ఏం తక్కువ లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇవే తగ్గించుకోవాలంటూ సెటైర్స్ వేస్తున్నారు.


ఇవీ చదవండి:

అంపైర్‌గా వరల్డ్ కప్ హీరో

ఐపీఎల్ కోసం రాహుల్ త్యాగం

కోహ్లీ దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2025 | 01:16 PM