Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:55 PM
తాజాగా బాలీవుడ్ సీనియర్ భామ మలైకా అరోరా రాజస్తాన్ రాయల్స్‌కు మద్దతు ఇవ్వడానికి గువాహటిలోని స్టేడియంకు వెళ్లింది. అయితే ఆమె అలా వెళ్లడం చాలా అనుమానాలకు కారణమవుతోంది. బాలీవుడ్ సెలబ్రిటీలు స్టేడియంకు వెళ్లి ఒక జట్టుకు మద్దతు ఇవ్వడం కొత్త విషయం కాదు.

ప్రస్తుతం ఐపీఎల్ (IPL 2025) ఫీవర్ నడుస్తోంది. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఈ క్రికెట్ సీజన్‌ను అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు నేరుగా స్టేడియంకు వెళ్లి తమకు నచ్చిన జట్లకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ భామ మలైకా అరోరా (Malaika Arora) రాజస్తాన్ రాయల్స్‌కు మద్దతు ఇవ్వడానికి గువాహటిలోని స్టేడియంకు వెళ్లింది (CSK vs RR). అయితే ఆమె అలా వెళ్లడం చాలా అనుమానాలకు కారణమవుతోంది. బాలీవుడ్ సెలబ్రిటీలు స్టేడియంకు వెళ్లి ఒక జట్టుకు మద్దతు ఇవ్వడం కొత్త విషయం కాదు.
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జెర్సీలో ఆ జట్టు డగౌట్‌లో మలైకా కనిపించింది. అయితే ఆమె పక్కన రాజస్తాన్ రాయల్స్ డైరెక్టర్ కుమార సంగక్కర (Kumar Sangakkara) కూడా ఉన్నాడు. మలైకా, సంగక్కర పక్కపక్కనే కూర్చోవడం, మాట్లాడుకోవడాన్ని పదే పదే చూపిండచంతో వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు మొదలయ్యాయి. చాలా కాలం అర్జున్‌కపూర్‌తో డేటింగ్ చేసిన మలైకా గతేడాది విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఆమె ఫలానా వ్యక్తితో డేటింగ్ చేస్తోందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ జాబితాలోకి సంగక్కర కూడా చేరాడు (Malaika Arora Dating with sangakkara).
శ్రీలంక మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ కుమార సంగక్కరకు 2003లో వివాహం జరిగింది. అతని భార్య పేరు యెహాలి. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో సంగక్కర డేటింగ్ వార్తలు చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కొంతమంది ఈ డేటింగ్ వార్తలను నమ్ముతుండగా, మరికొందరు మాత్రం అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు.
ఇవి కూడా చదవండి..
IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా
IPL 2025: దుమ్మురేపుతున్న జియో హాట్‌స్టార్.. రికార్డులు బద్దలుగొడుతున్న వ్యూయర్‌షిప్
IPL 2025, CSK vs RR: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్తాన్ రాయల్స్.. ఈ ఇద్దరిలో పైచేయి ఎవరిది
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..