Share News

Commentator Harsha Bhogle: రోస్టర్‌ వల్లే కామెంట్రీ చేయలేదు

ABN , Publish Date - Apr 23 , 2025 | 01:10 AM

ఈడెన్ గార్డెన్స్‌ మ్యాచ్‌కు దూరమవ్వడంపై హర్షా భోగ్లే స్పందించాడు. రోస్టర్‌ ప్రకారం కామెంట్రీ చేయలేదని, తాను పక్కనపెట్టబడ్డానన్న వార్తలు నిజమవని స్పష్టం చేశాడు

Commentator Harsha Bhogle: రోస్టర్‌ వల్లే కామెంట్రీ చేయలేదు

  • వ్యాఖ్యాత హర్షా భోగ్లే

న్యూఢిల్లీ: ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లకు తనను పక్కనబెట్టారనే వార్తలను కామెంటేటర్‌ హర్షా భోగ్లే ఖండించాడు. రోస్టర్‌ విధానం కారణంగా సోమవారం కోల్‌కతా-గుజరాత్‌ మ్యాచ్‌లో కామెంట్రీ చేయలేదని ఎక్స్‌లో తెలిపాడు. సొంత జట్టుకు క్యూరేటర్‌ సహకరించకపోతే నైట్‌రైడర్స్‌ను మరో సిటీకి తరలించాలని భోగ్లే, సైమన్‌ డౌల్‌ సూచించినట్టు ఆరోపణలు వచ్చా యి. దీంతో ఈడెన్‌లో జరిగే మ్యాచ్‌లకు వీరిద్దరినీ పక్కనబెట్టాలని బెంగాల్‌ క్రికెట్‌ సంఘం.. బీసీసీఐకి లేఖ రాసింది. ఫలితంగానే ఈడెన్‌లో గుజరాత్‌తో మ్యాచ్‌కు భోగ్లే దూరమయ్యాడన్న వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే భోగ్లే పైవిధంగా స్పందించాడు.

Updated Date - Apr 23 , 2025 | 01:12 AM