MS Dhoni: కీలక సమయంలో ధోనీ అవుట్.. చెన్నై అభిమాని రియాక్షన్ చూస్తే
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:36 PM
తాజా ఐపీఎల్‌లో ధోనీ కోసమే ఎంతో మంది స్టేడియంకు తరలివస్తున్నారు. ఆదివారం రాజస్తాన్ హోమ్ గ్రౌండ్ అయిన గువాహటి స్టేడియం కూడా పూర్తి పసుపుమయం అయిపోయింది. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ చూసేందుకు చెన్నై అభిమానులు భారీగా తరలివచ్చారు.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయినా ఎంఎస్ ధోనీని (MS Dhoni) అభిమానించే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా చెన్నై అభిమానులు (CSK Fans) ధోనీని తమ స్వంత వాడిలా చూసుకుంటారు. తాజా ఐపీఎల్ (IPL 2025)లో కూడా ధోనీ కోసమే ఎంతో మంది స్టేడియంకు తరలివస్తున్నారు. ఆదివారం రాజస్తాన్ హోమ్ గ్రౌండ్ అయిన గువాహటి స్టేడియం కూడా పూర్తి పసుపుమయం అయిపోయింది. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ (CSK vs RR) చూసేందుకు చెన్నై అభిమానులు భారీగా తరలివచ్చారు.
ఈ మ్యాచ్‌లో సీఎస్కేను రాజస్తాన్ టీమ్ ఆరు పరుగుల తేడాతో ఓడించింది. గత కొంత కాలంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో చివర్లో వస్తున్న ధోనీ ఈ మ్యాచ్‌లో మాత్రం కాస్త ముందుగానే వచ్చాడు. చెన్నై టీమ్‌ను గెలిపించేందుకు ప్రయత్నించాడు. ఒక సిక్స్, ఒక బౌండరీ బాది చెన్నై జట్టును గెలిపిస్తాడేమో అనిపించాడు. అయితే చివరి ఓవర్లో సందీప్ శర్మ బౌలింగ్‌లో హిట్‌మేయర్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు అవుటయ్యాడు. 11 బంతుల్లో 16 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మహేంద్ర సింగ్ ధోని అవుట్ (Dhoni Out) కాగానే స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది.
ధోనీ అవుటైన సమయంలో స్టేడియంలో ఉన్న ఓ అమ్మాయి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పసుపు రంగు జెర్సీ వేసుకున్న అమ్మాయి ధోనీ అవుట్ కావడంతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది (Dhoni Fan Girl). చేతిని ముందుకు పెట్టి చాలా ఆగ్రహానికి గురైంది. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్
IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త.. మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడా
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..