IPL 2025: రేపే ఐపీఎల్.. 2 మ్యాచులకు కీలక ఆటగాడు దూరం..
ABN , Publish Date - Mar 21 , 2025 | 07:20 PM
ఐపీఎల్ రేపే మొదలు కానుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ జట్టు ప్రధాన ఆటగాడైన కేఎల్ రాహుల్ మొదటి రెండు మ్యాచులకు దూరం కానున్నట్లు తెలిసింది.

ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్‌కు శుభవార్తతో పాటు చిన్న బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. స్టార్ బ్యాట్స్‌మన్ KL రాహుల్ ఈ ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంలో పాల్గొనడం లేదని తెలుస్తోంది. అయితే, దీనికి కారణం రాహుల్ భార్య అతియా శెట్టి మొదటి బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమవ్వడమే. ఈ శుభవార్తను, ఐపీఎల్ 2025 ప్రారంభం కొన్ని రోజుల ముందే, ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో చేరిన మహిళా జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ వెల్లడించారు.
మిచెల్ స్టార్క్ భార్య అయిన హీలీ, ఒక యూట్యూబ్ ఛానల్ చేసిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. KL రాహుల్ బహుశా మొదటి రెండు మ్యాచ్‌లలో ఆడకపోవచ్చని, ఆయన తన మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపింది.
రాహుల్‌ను ఎంతకు కొన్నారంటే..
ఐపీఎల్ 2025 వేలంలో రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 12 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. అంతకు ముందు, అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేసిన క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ అత్యధిక ధరకు దక్కించుకుంది. ఈ క్రమంలో రాహుల్ తన అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్‌తో ఈ సీజన్‌లో జట్టుకు మంచి సపోర్ట్ ఇవ్వాలని భావిస్తున్నాడు. కానీ ఇప్పుడు, మొదటి రెండు మ్యాచ్‌లకు రాహుల్ దూరం కానున్నట్లు తెలిసిన ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు కొంత నిరాశ పడుతున్నారు.
ఈ రెండు మ్యాచులకు..
రాహుల్ లేని మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరింత మంచి ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తోంది. మార్చి 24న విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. కానీ రాహుల్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్, వైస్ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌లతో పటిష్టమైన జట్టును తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అక్షర్ పటేల్ 2019 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉంటున్నాడు. జట్టుకు మంచి అనుభవం కలిగిన ఆటగాడు కూడా.
రాహుల్ లేకపోతే ఎవరు ఆడతారు
రాహుల్ అందుబాటులో లేకపోతే ఎలా అనే విషయంపై ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అనేక చర్చలు మొదలయ్యాయి. ఐపీఎల్లో రాహుల్ స్థానం భర్తీ చేసే ఆటగాడి గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ విషయాన్ని జట్టు శిబిరంలో చేరిన హీలీ కూడా ప్రస్తావించారు. రాహుల్ లేకపోవడంతో గ్యాప్‌ను ఎవరు భర్తీ చేస్తారో చూడాలని ఉందని ఆమె అన్నారు. రాహుల్ లేకపోవడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఆర్డర్‌లో పలు రకాల మార్పులను చేయనున్నారు. దీంతో రాహుల్ స్థానంలో ఎవరు ఆడతారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Indian Rupee: రెండేళ్ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థకు గుడ్ న్యూస్..పెరిగిన రూపాయి విలువ
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Viral News: కారు డ్రైవర్‌తో లొల్లి..రోడ్డు మధ్యలో నిలబడి ట్రాఫిక్ అడ్డుకున్న బైకర్
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News