Babar Azam: బాబర్ ఆజామ్ అరుదైన రికార్డు.. కోహ్లీని దాటేసిన పాక్ బ్యాటర్..!
ABN , Publish Date - Feb 14 , 2025 | 07:29 PM
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో బాబర్ ఆజామ్ (Babar Azam) అరుదైన రికార్డును చేరుకున్నాడు. బ్యాట్‌తో రాణిస్తూ తాజాగా ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఆరు వేల పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో బాబర్ ఆజామ్ (Babar Azam) అరుదైన రికార్డును చేరుకున్నాడు. బ్యాట్‌తో రాణిస్తూ తాజాగా ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఆరు వేల పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఆరు వేల పరుగులు పూర్తి చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడు హషిమ్ ఆమ్లాతో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని దాటేశాడు. (Babar Azam Record)
కేవలం 123 ఇన్నింగ్స్‌ల్లోనే బాబర్ ఆజామ్ ఈ ఫీట్ సాధించి హషిమ్ ఆమ్లాను సమం చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టాడు. కోహ్లీ 136 ఇన్నింగ్స్‌ల్లో ఆరు వేల పరుగులు పూర్తి చేశాడు. కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ 139 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించారు. మరో ఇండియన్ బ్యాటర్ శిఖర్ ధవన్ 140 ఇన్నింగ్స్‌ల్లో ఆరు వేల పరుగులను పూర్తి చేశాడు. అలాగే పాకిస్తాన్ తరఫున అత్యంత వేగంగా ఆరు వేల వన్డే పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా బాబర్ నిలిచాడు. పాకిస్థాన్ మాజీ ఓపెనర్ సయీద్ అన్వర్ 150 ఇన్నింగ్స్‌ల్లో 6000 పరుగులు పూర్తి చేశాడు.
కాగా, బాబర్ ఆజామ్ ఇప్పటికే వన్డేల్లో అత్యంత వేగంగా ఐదు వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. బాబార్ 5 వేల పరుగులను కేవలం 97 మ్యాచ్‌ల్లోనే పూర్తి చేశాడు. అయితే మరో వెయ్యి పరుగులు చేయడానికి బాబర్‌కు 26 మ్యాచ్‌లు అవసరమయ్యాయి. ఇటీవలి కాలంలో బాబర్ ఆజామ్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..