IPL 2025: పంజాబ్ సూపర్ కింగ్స్‌లో పవర్‌ఫుల్ హిట్టర్ల లిస్ట్ చుశారా..
ABN , Publish Date - Mar 25 , 2025 | 05:11 PM
ఈసారి ఐపీఎల్లో పంజాబ్ సూపర్ కింగ్స్ జట్టు ఎలాగైనా టైటిల్ గెలవాలనే ధీమాతో ఉంది. ఈ జట్టు బ్యాటింగ్ లైనప్ చూస్తే నిజమే అనిపిస్తుంది. గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, శ్రేయస్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

2025 ఐపీఎల్ 18వ సీజన్లో ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే ధీమాతో పంజాబ్ సూపర్ కింగ్స్ జట్టు ఉంది. ఎందుకంటే ఈ టీం బ్యాటింగ్ లైన్ అప్ చూస్తే అలాగే అనిపిస్తుంది. గత సీజన్లలో కొంత స్థిరత్వం కొరవడినప్పటికీ, ఈసారి మాత్రం మంచి ఆటగాళ్లతో ఉన్నారని చెప్పవచ్చు. రికీ పాంటింగ్ కోచింగ్‌లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఈ సీజన్లో అధిక స్కోర్ సాధించి, టైటిల్‌ను గెలవాలని ఆశిస్తోంది. ఈ క్రమంలో ఈ జట్టులోని కీలక ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. గ్లెన్ మాక్స్‌వెల్
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్, పంజాబ్ కింగ్స్‌కు తిరిగి చేరుకున్నాడు. ఐపీఎల్‌లో 134 మ్యాచ్‌లలో 2,771 పరుగులు చేసిన తనకి 150కి పైగా స్ట్రైక్ రేట్ ఉంది. తనకి మ్యాచ్‌ను ఒంటిచేత్తో మార్చే సత్తా ఉందని చెప్పవచ్చు. 18 అర్ధ సెంచరీలు సాధించిన గ్లెన్ మాక్స్‌వెల్, పంజాబ్ సూపర్ కింగ్స్‌కు డెత్ ఓవర్లలో కీలక ఆటగాడిగా ఉంటాడు.
2. శ్రేయస్ అయ్యర్
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, పంజాబ్ సూపర్ కింగ్స్‌లో భారీ ఖర్చుతో (రూ.26.75 కోట్లు) చేరాడు. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ గెలిపించేందుకు సహాయపడిన అతడు, 129 మ్యాచ్‌లలో 3402 పరుగులు సాధించాడు. దీంతోపాటు మిడిల్ ఆర్డర్‌లో కూడా ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. 2024 సీజన్‌లో 66 బంతుల్లో 96 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిపించిన శ్రేయస్, తన బ్యాటింగ్‌తో ఈజీగా పెద్ద షాట్లతో జట్టును ముందుకు నడిపిస్తాడని చెప్పవచ్చు. అతని నాయకత్వం, బ్యాటింగ్ పంజాబ్ సూపర్ కింగ్స్ జట్టుకు మరింత ప్రయోజనం చేకూరనుంది.
3. మార్కస్ స్టోయినిస్
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా పంజాబ్ సూపర్ కింగ్స్ జట్టులో కీలకమైన ఆటగాడిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో 96 మ్యాచ్‌లలో 1866 పరుగులు చేసిన తనకి 140కి పైగా స్ట్రైక్ రేట్ ఉంది. స్టోయినిస్ ప్రధానంగా డెత్ ఓవర్లలో విరుచుకుపడేలా ఆడతాడు. 2022లో లక్నో సూపర్ జెయింట్స్‌తో 15 బంతుల్లో 40 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిపించి తన సామర్థ్యాన్ని చూపించాడు.
4. ప్రభ్‌సిమ్రాన్ సింగ్
పంజాబ్ సూపర్ కింగ్స్, యువ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను రిటైన్ చేసింది. ఐపీఎల్‌లో 34 మ్యాచ్‌లలో 756 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్, 145కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఆడతాడు. 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 16 బంతుల్లో 50 పరుగులు చేసి అతడి పవర్ హిట్టింగ్‌ను చూపించాడు. పవర్‌ప్లేలో అతడు వేగంగా పరుగులు చేసి, బౌలర్లను ఒత్తిడిలో వేయడంలో యాక్టివ్‌గా ఉంటాడని చెప్పవ్చచు.
5. శశాంక్ సింగ్
రిటైన్డ్ ఆటగాడు శశాంక్ సింగ్ 2024 సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. 423 పరుగులు చేసిన అతడికి 161 స్ట్రైక్ రేట్ ఉంది. అతడు మిడిల్ లేదా లోయర్ ఆర్డర్‌లో ఆడుతూ, డెత్ ఓవర్లలో బౌలర్లపై భారీ షాట్లు ఆడగలడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై 61 నాటౌట్‌తో మ్యాచ్ గెలిపించడం, తన ప్రతిభకు నిదర్శనం. శశాంక్ కూడా డెత్ ఓవర్లలో జట్టుకు కీలక ఆటగాడిగా ఉంటాడనడంలో సందేహం లేదు.
ఇవి కూడా చదవండి:
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News