Share News

Rishabh Pant: రిషభ్-కుల్దీప్ ఫన్నీ మూమెంట్.. స్నేహితుడిని ఎలా ఆటపట్టిస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Mar 26 , 2025 | 03:39 PM

విశాఖపట్నం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్ అనూహ్య విజయం సాధించింది. దీంతో లఖ్‌నవూ కెప్టెన్ రిషభ్ పంత్‌పై విమర్శలు మొదలయ్యాయి. లఖ్‌నవూ యజమాని సంజీవ్ గోయెంకా కూడా పంత్‌కు క్లాస్ పీకినట్టు వార్తలు వచ్చాయి

Rishabh Pant: రిషభ్-కుల్దీప్ ఫన్నీ మూమెంట్.. స్నేహితుడిని ఎలా ఆటపట్టిస్తున్నాడో చూడండి..
Rishabh Pant funny moment with kuldeep yadav

సోమవారం విశాఖపట్నం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ (IPL 2025) మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్ అనూహ్య విజయం సాధించింది (DC vs LSG). దీంతో లఖ్‌నవూ కెప్టెన్ రిషభ్ పంత్‌ (Rishabh Pant)పై విమర్శలు మొదలయ్యాయి. లఖ్‌నవూ యజమాని సంజీవ్ గోయెంకా కూడా పంత్‌కు క్లాస్ పీకినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ మ్యాచ్‌లో పంత్‌కు సంబంధించిన ఓ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఢిల్లీ ఇన్నింగ్స్‌లో రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్ రెండో బంతిని కల్దీప్ యాదవ్ (Kuldeep yadav) కట్ చేశాడు. అయితే ఆ బంతి సరిగ్గా టైమ్ అవకపోవడంతో ఆ బంతి కీపింగ్ చేస్తున్న పంత్ చేతికి దొరికింది. దీంతో కుల్దీప్ ముందుకు వెళ్లబోయి వెంటనే క్రీజు లోపలే ఆగిపోయాడు. పంత్ వికెట్ల దగ్గరకు వచ్చి కుల్దీప్‌ను క్రీజు బయటకు తోసి వికెట్లను కొట్టాడు. దీంతో కుల్దీప్ కింద పడిపోయాడు. పంత్ చర్యను చూసి అందరూ సరదాగా చూసి నవ్వుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


పంత్, కుల్దీప్ చాలా మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు. అప్పట్నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. కాగా, సోమవారం జరిగిన ఆ మ్యాచ్‌లో అశుతోష్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఓటమి బాటలో ఉన్న ఢిల్లీ టీమ్‌ను విజయం దిశగా నడిపించాడు. గెలిచే స్థానంలో ఉన్న పుణెను ఓటమి బాట పట్టించాడు.

ఇవి కూడా చదవండి..

Sundar Pichai: వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఎందుకు లేదు.. తనకూ అర్థం కావడం లేదన్న గూగుల్ సీఈవో


Worst Record In IPL: ఐపీఎలో స్టార్ ఆటగాడి చెత్త రికార్డు.. నెక్ట్స్ మ్యాచ్‌‌లకు డౌటేనా


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 26 , 2025 | 03:39 PM