Sundar Pichai: వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఎందుకు లేదు.. తనకూ అర్థం కావడం లేదన్న గూగుల్ సీఈవో
ABN , Publish Date - Mar 26 , 2025 | 02:56 PM
అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గుజరాత్ టైటాన్స్ స్క్వాడ్‌లో వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు. అతడిని 3.2 కోట్ల రూపాయలకు గుజరాత్ జట్టు దక్కించుకుంది. అయితే తొలి మ్యాచ్‌లో అతడికి ఆడే అవకాశం లభించలేదు.

శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది (IPL 2025). అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది (GT vs PBKS). గుజరాత్ టైటాన్స్ స్క్వాడ్‌లో వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) కూడా ఉన్నాడు. అతడిని 3.2 కోట్ల రూపాయలకు గుజరాత్ జట్టు దక్కించుకుంది. అయితే తొలి మ్యాచ్‌లో అతడికి ఆడే అవకాశం లభించలేదు. సుందర్‌కు జట్టులో చోటు కల్పించకపోవడంపై అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా జట్టులో వాషింగ్టన్ సుందర్ కూడా సభ్యుడు. అలాంటిది ఓ ఐపీఎల్ జట్టు అతడిని పక్కన పెట్టడం ఫ్యాన్స్‌కు విస్మయం కలిగించింది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని.. దేశంలోని అత్యున్నత ఆటగాళ్లు మాత్రమే ఆడే టీమిండియాలో వాషింగ్టన్ సుందర్‌కు చోటు దక్కింది. కానీ, 10 టీమ్‌లు ఉన్న ఐపీఎల్‌లో తుది జట్టులో మాత్రం అతడికి చోటు దక్కడం లేదు అని కామెంట్ చేశాడు. ఈ పోస్ట్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) దృష్టికి కూడా వెళ్లింది. ఈ పోస్ట్‌పై ఆయన స్పందిస్తూ.. నాకూ అదే ఆశ్చర్యంగా ఉంది అని రిప్లయ్ ఇచ్చారు.
వాషింగ్టన్ సుందర్ ఫ్యాన్ వార్‌లోకి సుందర్ పిచాయ్ ఎంటర్ కావడం, రిప్లయ్ ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏదేమైనా గుజరాత్ తుది జట్టులో వాషింగ్టన్ సుందర్‌కు చోటు లేకపోవడంపై మాజీలు కూడా విమర్శలు చేస్తున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ ఆడి ఉంటే మంగళవారం మ్యాచ్‌లో గుజరాత్ గెలిచి ఉండేదని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Worst Record In IPL: ఐపీఎలో స్టార్ ఆటగాడి చెత్త రికార్డు.. నెక్ట్స్ మ్యాచ్‌లకు డౌటేనా
Vignesh puthur: విఘ్నేష్ పుత్తుర్.. ఆటో డ్రైవర్ కొడుకుతో ధోనీ ఏం మాట్లాడాడంటే..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..