Shreyas Iyer: ఎంత పని చేశావు అయ్యర్.. ధోనీ, కోహ్లీలను ఇంతలా తిట్టిస్తావా.. వీడియో చూస్తే
ABN , Publish Date - Mar 26 , 2025 | 05:21 PM
ఓవైపు యువ క్రికెటర్ శశాంక్ బౌండరీలు బాదుతుండడంతో కెప్టెన్ అయ్యర్ స్ట్రైక్ అతడికే ఇచ్చాడు. తను 97 పరుగుల వద్ద ఉన్నా సెంచరీ చేయాలనే ఆత్రుత కనబరచలేదు. వీలైనన్ని పరుగులు స్కోరు బోర్డు మీద చేర్చాలనే ప్రయత్నించాడు. శశాంక్ చేసిన పరుగులే పంజాబ్‌కు విజయాన్ని అందించాయి.

నిజమే.. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో (PBKS vs GT) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) జట్టు ప్రయోజనాల కోసమే ఆడాడు. ఓవైపు యువ క్రికెటర్ శశాంక్ (Shashank Singh) బౌండరీలు బాదుతుండడంతో స్ట్రైక్ అతడికే ఇచ్చాడు. తను 97 పరుగుల వద్ద ఉన్నా సెంచరీ చేయాలనే ఆత్రుత కనబరచలేదు. వీలైనన్ని పరుగులు స్కోరు బోర్డు మీద చేర్చాలనే ప్రయత్నించాడు. శశాంక్ చేసిన పరుగులే పంజాబ్‌కు విజయాన్ని అందించాయి. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో గుజరాత్‌పై పంజాబ్ 11 పరుగుల తేడాతోనే విజయం సాధించింది.
వ్యక్తిగత రికార్డుల కోసం శ్రేయస్ ప్రయత్నించకపోవడాన్ని అందరూ ఎంతగానో ప్రశంసిస్తున్నారు. శ్రేయస్ నిస్వార్థంగా ఆడాడని పొగుడుతున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ (Virat Kohli), మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) గతంలో చేసిన ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గతంలో జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో చివరి ఓవర్లో కోహ్లీ 96 పరుగులతో ఆడుతున్నాడు. ఆ సమయంలో మరో బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ బంతిని కొట్టి రెండు పరుగులు చేయడానికి ప్రయత్నించాడు. అయితే కోహ్లీ సింగిల్ మాత్రమే చేసి స్ట్రయిక్ తీసుకున్నాడు. అప్పుడు తన సెంచరీ చేయడానికే ప్రయత్నించాడు.
అలాగే మరో ఐపీఎల్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ 49 పరుగులతో ఆడుతున్నాడు. ఆ సమయంలో బౌల్ట్ వేసిన బంతిని ధోనీ ఆడాడు. బాల్ కీపర్ చేతికి వెళ్లింది. ఆ సమయంలో నాన్ స్ట్రైక్‌లో ఉన్న రాయుడు పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. ధోనీ మాత్రం క్రీజ్ దాటలేదు. దీంతో ఆ మ్యాచ్‌లో రాయుడు రనౌట్ అయిపోయాడు. ఆ రెండు వీడియోలను అభిమానులు తాజాగా షేర్ చేస్తూ.. వీళ్లను చూసి శ్రేయస్ అయ్యర్ నేర్చుకోవాలని, వ్యక్తిగత రికార్డులకే ప్రాధాన్యం ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Rishabh Pant: రిషభ్-కుల్దీప్ ఫన్నీ మూమెంట్.. స్నేహితుడిని ఎలా ఆటపట్టిస్తున్నాడో చూడండి..
Sundar Pichai: వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఎందుకు లేదు.. తనకూ అర్థం కావడం లేదన్న గూగుల్ సీఈవో
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..