Share News

Virendra Sehwag: గిల్‌కు కెప్టెన్సీ చేయాలని లేదా.. గుజరాత్ కెప్టెన్‌పై సెహ్వాగ్ విమర్శలు

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:55 PM

భవిష్యత్తులో టీమిండియాకు నాయకత్వం వహించే సామర్థ్యం గిల్‌కు ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్‌లో గిల్ తన జట్టును సమర్థంగా నడిపిస్తే టీమిండియా కెప్టెన్సీ వెతుక్కుంటూ వస్తుందని భావిస్తున్నారు. అయితే ఆ విషయంలోనే గిల్ తడబడుతున్నాడు.

Virendra Sehwag: గిల్‌కు కెప్టెన్సీ చేయాలని లేదా.. గుజరాత్ కెప్టెన్‌పై సెహ్వాగ్ విమర్శలు
Virendra Sehwag

శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) టీమిండియాకు కాబోయే కెప్టెన్ అని చాలా మంది క్రికెట్ పండితులు భావిస్తున్నారు. భవిష్యత్తులో టీమిండియాకు నాయకత్వం వహించే సామర్థ్యం గిల్‌కు ఉందని అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్‌లో (IPL 2025) గిల్ తన జట్టును సమర్థంగా నడిపిస్తే టీమిండియా కెప్టెన్సీ వెతుక్కుంటూ వస్తుందని భావిస్తున్నారు. అయితే ఆ విషయంలోనే గిల్ తడబడుతున్నాడు. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో (GT vs PBKS) గిల్ కెప్టెన్సీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virendra Sehwag) కూడా గిల్ కెప్టెన్సీపై విమర్శలు గుప్పించాడు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో గిల్ విఫలమయ్యాడని విమర్శించాడు. మైదానంలో శుభ్‌మన్ గిల్‌ను చూస్తుంటే అతడు కెప్టెన్సీకి సిద్ధంగా ఉన్నాడా అనే అనుమానం వస్తోందని, అతడు యాక్టివ్‌గా కనిపించడం లేదని అభిప్రాయపడ్డాడు. సిరాజ్‌ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు అతడిని పక్కన పెట్టి అర్షద్ ఖాన్‌ను తీసుకురావడం తప్పిదంగా మారిందని, ఆ ఓవర్ నుంచే పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఊపు వచ్చిందని సెహ్వాగ్ అన్నాడు. పవర్ ప్లేలో సిరాజ్‌తోనే బౌలింగ్ కొనసాగించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.


సిరాజ్‌ చేత డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయించకూడదని, అతడిని ముందుగానే వినియోగించుకోవాలని సెహ్వాగ్ సూచించాడు. బౌలర్లను వినియోగించుకునే విషయంలో గిల్ మరింత యాక్టివ్‌గా ఉండాలని అన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో గిల్ మెరుగవుతాడని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు. అలాగే లఖ్‌నవూ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా తన స్థాయికి తగ్గట్టుగా సారథ్యం వహించలేదని అన్నాడు. జట్టులోని లేని వారి గురించి ఆలోచించడం మానేసి, ఉన్న వారితో ఎలా ఆడించాలో పంత్ నేర్చుకోవాలని అన్నాడు.

ఇవి కూడా చదవండి..

Riyan Parag: ఆ కుర్రాడికి రూ.10 వేలు ఇచ్చాడా.. రియాన్ పరాగ్ కాళ్లు మొక్కడంపై నెటిజన్లు కామెంట్లు ఏంటంటే


Sundar Pichai: వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఎందుకు లేదు.. తనకూ అర్థం కావడం లేదన్న గూగుల్ సీఈవో


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2025 | 04:55 PM