Ishan Kishan Century IPL 2025: సెంచరీకి అతడే కారణం.. ఒక్క మాటతో కొట్టిపడేశా: ఇషాన్
ABN , Publish Date - Mar 23 , 2025 | 07:28 PM
Indian Premier League: సన్‌రైజర్స్ నయా ఓపెనర్ ఇషాన్ కిషన్ సెంచరీతో అదరగొట్టేశాడు. ఆరెంజ్ ఆర్మీ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే మెరుపు శతకంతో కాటేరమ్మకు తాను చిన్న కొడుకునని నిరూపించుకున్నాడు.

క్రమశిక్షణా చర్యల కింద భారత క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడతను. టీమిండియాలోనూ చోటు కోల్పోయి ఏకాకిగా మిగిలాడు. ఫామ్ పోయింది, మెంటల్ హెల్త్ కూడా దెబ్బతింది. దీంతో ఇక అతడి కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ గోడకు కొట్టిన బంతిలా రివ్వున ఎగిరిన ఆ పించ్ హిట్టర్.. సూపర్ సెంచరీ (47 బంతుల్లో 106 నాటౌట్)తో ఘనంగా కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అతడే సన్‌రైజర్స్ జట్టు నయా ఓపెనర్, టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్. ఐపీఎల్-2025లో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ థ్రిల్లింగ్ నాక్‌తో అందర్నీ మెస్మరైజ్ చేశాడు. అయితే ఆ ఒక్కడు చెప్పిన మాటల వల్లే ఇది సాధ్యమైందని అంటున్నాడు. మరి.. ఇషాన్‌కు హెల్ప్ చేసిన అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
లైసెన్స్ ఇచ్చేశాడు
సన్‌రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాను సెంచరీ బాదానని అన్నాడు ఇషాన్. రెచ్చిపోయి ఆడు.. నేను చూసుకుంటానంటూ అతడు ఇచ్చిన ధైర్యం వల్లే మెరుపు శతకం కొట్టానన్నాడు. ఇన్నింగ్స్ పూర్తయ్యాక అతడు మాట్లాడుతూ.. కమిన్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాడు. అతడు తనకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చానని పేర్కొన్నాడు ఇషాన్. తనకే కాదు.. మొత్తం జట్టు ఆటగాళ్లకు వాళ్లకు నచ్చినట్లు ఆడేలా స్వేచ్ఛను ఇచ్చాడని తెలిపాడు. తాను సెంచరీ బాదినా.. డకౌట్ అయినా ఫరక్ పడదంటూ తమలో ధైర్యం నూరిపోశాడని ఇషాన్ వివరించాడు. కాగా, ఇషాన్ సెంచరీ కారణంగా ఈ మ్యాచ్‌లో 286 పరుగుల భారీ టార్గెట్ సెట్ చేసింది ఎస్ఆర్‌హెచ్. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన రాజస్థాన్.. ప్రస్తుతం 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగులు చేసింది.
ఇవీ చదవండి:
సొంత రికార్డును బ్రేక్ చేసిన ఎస్ఆర్‌హెచ్
13 కోట్ల ఆటగాడి చెత్త రికార్డు
ఎస్‌ఆర్‌హెచ్ దెబ్బకు వాళ్లపై వాళ్లే మీమ్ వేసుకున్నారు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి