Share News

Champions Trophy 2025: పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల మాస్టర్ ప్లాన్.. ప్రమాదంలో ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ?

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:42 PM

పలు దేశాలు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్‌లో పర్యటిస్తున్నాయి. విదేశీ ఆటగాళ్లు, ఆయా దేశాల అభిమానులు పెద్ద సంఖ్యలో పాక్‌కు చేరుకున్నారు. మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఉద్రవాదులు భారీ కుట్ర పన్నుతున్నట్టు సమాచారం.

Champions Trophy 2025:  పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల మాస్టర్ ప్లాన్.. ప్రమాదంలో ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ?
Champions Trophy 2025

చాలా సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ (Pakistan) ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. పలు దేశాల ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) కోసం పాకిస్తాన్‌లో పర్యటిస్తున్నారు. విదేశీ ఆటగాళ్లు, ఆయా దేశాల అభిమానులు పెద్ద సంఖ్యలో పాక్‌కు చేరుకున్నారు. మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఉద్రవాదులు (Terrorists) భారీ కుట్ర పన్నుతున్నట్టు సమాచారం. ఈ మేరకు పాకిస్తాన్ పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి.


విదేశీ అతిథులను లక్ష్యంగా చేసుకుని తెహ్రీక్ -ఈ తాలిబాన్ పాకిస్తాన్ (TTP), ఐఎస్ఐఎస్(ISIS), బలూచిస్తాన్ కు చెందిన పలు ఉగ్రవాద గ్రూపులు భారీ కుట్ర వేస్తున్నట్టు పాక్ ఇంటెలిజెన్స్ అనుమానిస్తున్నట్టు సమాచారం. విదేశీ అతిథులను కిడ్నాప్ చేయాలనే లక్ష్యంతో పలు ఉగ్ర గ్రూపులు పథకాలు రచిస్తున్నాయట. ఈ క్రమంలో పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో సోమవారం భద్రతా దళాలకు సందేశం పంపినట్టు సమాచారం. యాక్టివ్ కోవర్ట్ గ్రూపులు ఈ కుట్రకు తెరతీశాయని, భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్టు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లకు, అతిథులకు భారీ రక్షణ కల్పించేందుకు ఆర్మీ, స్థానిక పోలీసులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. కాగా, భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 24 , 2025 | 04:42 PM