Home » terror attack
రాణాను విజయవంతంగా ఇండియాకు తీసుకువచ్చి దేశ న్యాయవ్యవస్థ ముందు నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదిని ఫడ్నవిస్ ప్రశంసించారు. నవంబర్ 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల్లో తమ కుటుంబాలను కోల్పోయిన ముంబై ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
గ్రదాడులు జరిగిన రోజు రాత్రిని ఎప్పటికీ మరచిపోలేనని, ఎన్ఎస్జీ ఆపరేషన్ ఇప్పటికీ తన కళ్ల ముందు ఉందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో హిమంత బిశ్వా శర్మ తెలిపారు.
ముంబైలో 26/11 దాడి ఘటన జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇలాంటి ఉగ్ర ఘటనల్లో ప్రమేయమున్న వారిపై కఠిన చట్టం అవసరమైందని. యూపీఏ హయాంలోనే ఎన్ఐఏ ఏర్పిడిందని కపిల్ సిబల్ తెలిపారు.
భారత్ సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న తరుణం మరికొన్ని గంటల్లో రాబోతుంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, 2008 ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణా మరికొన్ని గంటల్లో ఇండియా రానున్నాడని తెలుస్తోంది. ఆ వివరాలు...
26/11 ముంబై ఉగ్ర దాడి నిందితుడు తహవీర్ రాణాను ఇండియాకు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ప్రత్యేక విమానంలో అతడిని భారత్‌కు తరలిస్తున్నారని సమాచారం. అతడిని ఇండియాకు తీసుకువచ్చేందుకు భారత్ అధికారుల బృందం అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.
బలోచిస్థాన్ ప్రావిన్స్‌లోని ప్రయాణికుల రైలుపై కాల్పులతో దాడి చేశారు. రైలు ఆగగానే వందలాది మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. ఈ దాడిలో ఆరుగురు మిలటరీ సిబ్బందిని ప్రాణాలు కోల్పోయారు.
పలు దేశాలు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్లో పర్యటిస్తున్నాయి. విదేశీ ఆటగాళ్లు, ఆయా దేశాల అభిమానులు పెద్ద సంఖ్యలో పాక్‌కు చేరుకున్నారు. మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఉద్రవాదులు భారీ కుట్ర పన్నుతున్నట్టు సమాచారం.
India-Pakistan: జమ్మూ కాశ్మీర్‌లోని భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. బుధవారం సాయంత్రం పూంచ్ జిల్లా జమ్మూ డివిజన్లోని బాలాకోట్ ప్రాంతం సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది జరిపింది. ఈ చర్యలతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం దాయాది సైన్యంపై విరుచుకుపడింది.
Attacks on Hindus In Balochistan: పాకిస్థాన్‌లో నివసిస్తున్న హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పొరుగు దేశంలో మైనారిటీలుగా జీవిస్తున్న హిందూ ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. నిరంతర ఉగ్రవాద దాడులకు జడిసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనలతో కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా కొందరు ఆగంతకులు బలూచిస్తాన్‌లో హిందువులను కాల్చి చంపారు.
Nellore Terrorist:ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ పీఎఫ్ఐ ఉగ్రవాది షేక్ ఇలియాజ్ అహ్మద్‌కు చెందిన పలు ఉగ్రకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ముంస్లి యువకులను పీఎఫ్ఐలో చేర్పించి దేశంపై దాడులకు శిక్షణ ఇప్పించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలిింది.