Share News

Worst Record In IPL: ఐపీఎలో స్టార్ ఆటగాడి చెత్త రికార్డు.. నెక్ట్స్ మ్యాచ్‌‌లకు డౌటేనా

ABN , Publish Date - Mar 25 , 2025 | 09:56 PM

బౌలింగ్ కూడా చేయగలిగే మ్యాక్స్‌వెల్ హార్డ్ హిట్టర్. ఒకరకంగా చెప్పాలంటే టీ-20 స్పెషలిస్ట్ బ్యాటర్. ఈ కారణంతోనే అతడికి ఐపీఎల్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. అతడిని దక్కించుకునేందుకు పలు టీమ్‌లు పోటీపడతాయి.

Worst Record In IPL: ఐపీఎలో స్టార్ ఆటగాడి చెత్త రికార్డు.. నెక్ట్స్ మ్యాచ్‌‌లకు డౌటేనా
Glenn Maxwell

ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) ఎప్పుడు, ఎలా ఆడతాడో చెప్పడం కష్టం. బౌలింగ్ కూడా చేయగలిగే మ్యాక్స్‌వెల్ హార్డ్ హిట్టర్. ఒకరకంగా చెప్పాలంటే టీ-20 స్పెషలిస్ట్ బ్యాటర్. ఈ కారణంతోనే అతడికి ఐపీఎల్‌ (IPL 2025)లో మంచి డిమాండ్ ఉంటుంది. అతడిని దక్కించుకునేందుకు పలు టీమ్‌లు పోటీపడతాయి. గత సీజన్ వరకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడిన మ్యాక్స్‌వెల్‌ను ఈ సీజన్‌లో పంజాబ్ దక్కించుకుంది. అతడి కోసం రూ.4.2 కోట్లు వెచ్చించింది. అయితే ఫ్రాంఛైజీ మారినా మ్యాక్స్‌వెల్ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది (Glenn Maxwell duck out).


అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS vs GT) తరఫున బరిలోకి గ్లెన్ మ్యాక్స్‌వెల్ మరోసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇది మ్యాక్స్‌వెల్‌కు ఐపీఎల్‌లో 19వ డకౌట్. ఐపీఎల్‌లో ఇన్నిసార్లు డకౌట్ అయిన మరో బ్యాటర్ లేడు. రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్‌లు ఇప్పటికి 18 సార్లు డకౌట్ అయ్యారు. వారిని తాజా మ్యాచ్‌తో మ్యాక్స్‌వెల్ దాటేశాడు. మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ కెరీర్‌లో 135 మ్యాచ్‌లు ఆడి 2,771 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ (156.73) బాగానే ఉన్నా, సగటు (24.74) మాత్రం తక్కువగానే ఉంది.


ముఖ్యంగా మ్యాక్స్‌వెల్ ఆడే రివర్స్ స్వీప్, లాఫ్టెడ్ కవర్ డ్రైవ్ షాట్లే అతడి కొంప ముంచుతున్నాయి. వైవిధ్యమైన షాట్లు ఆడడానికి ప్రయత్నించి వికెట్ పారేసుకుంటున్నాడు. గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన 10 మ్యాచ్‌లలో కేవలం 52 పరుగులు (సగటు 5.77) మాత్రమే చేశాడు. అందులో నాలుగు సార్లు డకౌట్ అయ్యాడు. దీంతో మ్యాక్స్‌వెల్‌ను బెంగళూరు రిటైన్ చేసుకోలేదు. పంజాబ్ ఆసక్తి చూపించింది.


ఈ సీజన్‌లో కూడా తన ప్రస్థానాన్ని డకౌట్‌తోనే ప్రారంభించాడు. అయితే మ్యాక్స్‌వెల్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఆస్ట్రేలియా 2021 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్‌పై మ్యాక్స్‌వెల్ ఆడిన (128 బంతుల్లో 201 నాటౌట్) ఇన్నింగ్స్ వన్డేల్లో గుర్తుంచుకోదగిన ఇన్నింగ్స్ అనడంలో సందేహం లేదు.

ఇవి కూడా చదవండి..

Dhanashree-Ritika: ఛాహల్ మాజీ భార్యపై జర్నలిస్ట్ విమర్శ.. లైక్ కొట్టిన రోహిత్ భార్య రితిక


Vignesh puthur: విఘ్నేష్ పుత్తుర్.. ఆటో డ్రైవర్ కొడుకుతో ధోనీ ఏం మాట్లాడాడంటే..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 25 , 2025 | 09:56 PM