Share News

BSNL 5G: మొదట ఈ నగరంలోనే బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు..కంపెనీ సీఎండీ కీలక ప్రకటన

ABN , Publish Date - Mar 25 , 2025 | 05:53 PM

ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL దేశంలో 5G సేవలను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే జూన్ నుంచి 5జీ సేవలను విస్తరించనున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కంపెనీ సీఎండీ 5జీ సేవల గురించి మరిన్ని కీలక విషయాలను ప్రస్తావించారు.

BSNL 5G: మొదట ఈ నగరంలోనే బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు..కంపెనీ సీఎండీ కీలక ప్రకటన
bsnl 5g services

ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNL 5జీ సేవలు త్వరలో దేశంలో మొదలు కానున్నాయి. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించారు. BSNL 5G విస్తరణ ఈ సంవత్సరం జూన్ నాటికి ప్రారంభమవుతుందని తెలుపగా, అనేక మంది యూజర్లు ఎక్కడ మొదట ఈ సేవలు ప్రారంభమవుతాయని ఆసక్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే BSNL సంస్థ CMD, రాబర్ట్ J రవి, 5G సేవల గురించి మరిన్ని కీలక విషయాలను పంచుకున్నారు.


ఇప్పటికే పైలట్ పరీక్షలు

ఆయన చెప్పిన ప్రకారం చూస్తే BSNL 5G సేవలు మొదట ఢిల్లీలో ప్రారంభమవుతాయన్నారు. నెట్‌వర్క్ యాజ్ ఎ సర్వీస్ (NaaS) మోడల్‌ను ఉపయోగించి, కంపెనీ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఢిల్లీ తర్వాత, మరిన్ని నగరాలకు ఈ సేవలను విస్తరించడానికి సంస్థ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 5G సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, వినియోగదారులు వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, మెరుగైన డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్, అధిక నాణ్యత గల కాల్స్ వంటి అనేక ప్రయోజనాలను పొందగలుగుతారన్నారు. ఇదే సమయంలో BSNL ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడుతుందని సీఎండీ వెల్లడించారు.


టవర్ల ఏర్పాటులో..

గత సంవత్సరం, BSNL ఢిల్లీలో 5G సేవలపై పైలట్ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు స్థానిక విక్రేతల సహాయంతో జరిగాయి. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DoT) వంటి సంస్థలు BSNL కోసం 100,000 కొత్త 4G మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడంలో సహాయపడుతున్నాయి. ఈ భాగస్వామ్యాలు BSNL 5G సేవలను మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.


ప్రభుత్వ మద్దతు

BSNLను పునరుజ్జీవింపజేయడానికి ప్రభుత్వం గత సంవత్సరం బడ్జెట్‌లో రూ. 80,000 కోట్లకు పైగా కేటాయించింది. ఈ నిధులు BSNL సామర్థ్యాలను పెంపొందించడానికి, నూతన సాంకేతికతలను అందించడానికి, వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి ఉపయోగించబడతాయి. ఈ చర్యలు BSNL భవిష్యత్తుకు కొత్త మార్గాలను అందించనున్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో వినియోగదారులు వేగవంతమైన, నాణ్యమైన సేవలను కోరుకుంటున్నారు. ఈ క్రమంలో BSNL 5G సేవలు కూడా అందుబాటులోకి వస్తే, అనేక మంది ఈ సేవలపై ఆసక్తి చూపనున్నారు.


ఇవి కూడా చదవండి:

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 25 , 2025 | 05:53 PM