Share News

Huawei FreeBuds 6: ఈ ఇయర్‌బడ్స్ చాలా ప్రత్యేకం..తల ఊపడంతో కాల్ స్వీకరణ

ABN , Publish Date - Mar 21 , 2025 | 05:56 PM

ప్రముఖ చైనీస్ బ్రాండ్ Huawei ప్రీమియమ్ వైర్ లెస్ ఇయర్‌ఫోన్స్ FreeBuds 6ను ప్రవేశపెట్టింది. అయితే ఇవి అతి చిన్నగా ఉండి, స్మార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వచ్చాయి. అయితే వీటి ధర, ఫీచర్ల వంటి విశేషాలను ఇప్పుడు చూద్దాం.

Huawei FreeBuds 6: ఈ ఇయర్‌బడ్స్ చాలా ప్రత్యేకం..తల ఊపడంతో కాల్ స్వీకరణ
Huawei FreeBuds 6

చైనాకు చెందిన ప్రముఖ సంస్థ హువావే (Huawei) మార్కెట్లోకి కొత్తగా వైర్ లెస్ ఇయర్‌ఫోన్‌లను ప్రవేశపెట్టింది. FreeBuds 6 TWS (True Wireless Stereo) కొత్త ఇయర్‌ఫోన్‌లు, హువావే పురా X ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు లాంచ్ చేశారు. Huawei FreeBuds 6 బడ్స్ శక్తివంతమైన టెక్నాలజీతో వినియోగదారులకు ప్రత్యేక డిజైన్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.


డిజైన్ చేయడం

Huawei FreeBuds 6 ఇయర్‌ఫోన్‌లు ప్రత్యేకమైన సెమీ ఓపెన్ డిజైన్‌ను కల్గి ఉన్నాయి. వాటర్ డ్రాప్ ఆకారం, అలాగే చెవి లోపల సరిపోయే రీఫైన్డ్ డిజైన్, వినియోగదారులకు ఉపయోగించడానికి అనువుగా ఉంటుంది. ఇవి చెవి ఆకారాల పరిమాణాలకు అనుగుణంగా డిజైన్ చేయడం వల్ల వినియోగదారులకు సౌకర్యాన్నిఅందిస్తాయి. ఈ ఇయర్‌ఫోన్ పరిమాణం 30.6 x 18.5 x 24 mm, బరువు కేవలం 4.9 గ్రాములు మాత్రమే. మునుపటి మోడళ్లతో పోలిస్తే, ఈ ఇయర్‌ఫోన్‌లు 9% తేలికపాటి, 12% చిన్నవిగా ఉండటం విశేషం. ఈ కొత్త డిజైన్ ప్రయాణాల సమయంలో లేదా ఇతర సమయాలలో కూడా అతి తేలికగా ఉంటుంది.


డ్యూయల్ డ్రైవ్, డైనమిక్ ANC

వీటిలో డ్యూయల్ డ్రైవర్ సిస్టమ్ ఉపయోగించడం వల్ల, ఎక్కువ శక్తిని, ఖచ్చితమైన శబ్ద నాణ్యతను అందించడానికి ఛాన్సుంది. ఈ ఇయర్‌ఫోన్‌లు HWA లాస్‌లెస్, హై రెస్ వైర్‌లెస్ సర్టిఫికేషన్లను అందిస్తాయి. తద్వారా వినియోగదారులు అత్యుత్తమ శబ్దానుభవాన్ని పొందవచ్చు. వీటిలో ఆటోమేటిక్ నోయిస్ క్యాన్సలేషన్ (ANC) కూడా అందించబడింది. ఇది ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు పరికరంలోని రహస్యమైన ధ్వనులను నివారిస్తుంది. ఇది IP54 రేటింగ్ కలిగి ఉన్నందున, వర్షం, దుమ్ము నుంచి రక్షించబడుతుంది.


స్మార్ట్ ఫీచర్లు

సెలియా AI అసిస్టెంట్ ద్వారా వినియోగదారులు అనువాదం, వాయిస్ కంట్రోల్, మరిన్ని ఫీచర్లను దీనిలో ఉపయోగించవచ్చు. ఈ ఇయర్‌బడ్‌లతో తల ఊపడం ద్వారా కాల్‌లు స్వీకరించడం లేదా తిరస్కరించడం చేయవచ్చు. అంతేకాకుండా వినియోగదారులు తమ వాతావరణం, శబ్ద స్థాయిలను బట్టి, స్మార్ట్ వాల్యూమ్ నియంత్రణ చేసుకోవచ్చు. ఇది 50Hz నుంచి 2kHz మధ్య ధ్వనులను సర్దుబాటు చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా వీటిని ఈజీగా వినియోగించుకోవచ్చు.


దీర్ఘకాలిక వినియోగం

Huawei FreeBuds 6 ఇయర్‌ఫోన్‌లు పరిమాణానికి తగ్గట్లుగా గొప్ప బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. ప్రతి ఇయర్‌ఫోన్ 39.5mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. అలాగే 510mAh ఛార్జింగ్ కేస్ కూడా ఉంది. ఒకే ఛార్జింగ్‌పై 6 గంటల పాటు ప్లేబ్యాక్ పొందవచ్చు. అలాగే చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 36 గంటలు వినియోగించుకోవచ్చు. వినియోగదారు ఛార్జింగ్ అలవాట్లను గుర్తించి, బ్యాటరీ జీవితాన్ని పెంచడానికి ఛార్జింగ్ పరిమితులను సమర్ధంగా నియంత్రిస్తుంది.


ధర, లభ్యత

Huawei FreeBuds 6 ధర CNY 999 (సుమారు రూ.11,900) గా నిర్ణయించబడింది. ఇవి మూడు అరోరా పర్పుల్, స్కై వైట్, స్టార్రి స్కై బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం, ఈ ఇయర్‌ఫోన్‌లు Huawei చైనా e-స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. మార్చి 28 నుంచి వీటిని మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు.


ఇవి కూడా చదవండి:

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ


Viral News: కారు డ్రైవర్‌తో లొల్లి..రోడ్డు మధ్యలో నిలబడి ట్రాఫిక్ అడ్డుకున్న బైకర్


Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 21 , 2025 | 05:58 PM