Indian Americans: సీన్ రివర్స్.. ఇకపై భారత్ నుంచి ఐఫోన్ కావాలని, ఎన్నారై ఫ్రెండ్స్ అడిగే ఛాన్స్..
ABN , Publish Date - Apr 04 , 2025 | 07:44 PM
ఇది వరకు అమెరికాలో ఐఫోన్లు తక్కువ ధరకు వచ్చేవి. ఆ క్రమంలో ఇండియాలో ఉన్న ఐఫోన్ లవర్స్ అక్కడి నుంచి వచ్చే ఫ్రెండ్స్‌ను ఫోన్లు తెవాలని అడిగేవారు. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ మరనుంది. ఇకపై ఇండియా నుంచి వచ్చే దోస్తులను అమెరికా ఐఫోన్ ప్రియులు ఫోన్లను తీసుకురావాలని కోరే అవకాశం ఉందని ఆయా వర్గాలు చెబుుతున్నాయి.

ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో ఐఫోన్స్ తక్కువ ధరకు లభించేవి. దీంతో ఇండియాలో ఉన్న అనేక మంది ఐఫోన్ ప్రియులు అమెరికా నుంచి వచ్చే వారి NRI దోస్తులను ఒక ఐఫోన్ తేవాలని కోరేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారనుంది. దీంతోపాటు ఇదే సీన్ రివర్స్ కానుంది. అమెరికాలోని (NRIలు) తమకు ఐఫోన్ కావాలని భారత్ నుంచి వచ్చే ఫ్రెండ్స్‌ను అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం చైనాను టార్గెట్ చేసుకుని, అక్కడ ఉత్పత్తి చేస్తున్న పరికరాలపై 34% సుంకాలు విధించింది. ఆపిల్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలు చైనా దిగుమతులకు ఆధారపడినందున, ఈ నిర్ణయం ఆపిల్ ఉత్పత్తుల ధరలను భారీగా పెంచే అవకాశం ఉంది. దీంతో ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మాక్‌బుక్‌లతో సహా అనేక ఆపిల్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి.
ఇండియాలో ఇప్పటికే సక్సెస్..
ఇటీవల సుంకాల నుంచి మినహాయింపులు పొందడం కోసం, ఆపిల్ భారతదేశం, వియత్నామ్ వంటి దేశాల్లో తమ ఉత్పత్తులను ప్రారంభించింది. ఈ దేశాలలో అసెంబ్లింగ్ చేయబడిన ఐఫోన్‌లు, అమెరికాలో తయారైన వాటితో పోలిస్తే మరింత చౌకగా లభించనున్నాయి. ఇప్పటికే ఇండియాలో ఐఫోన్ తయారీకి మరింత ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, ఉత్పత్తి ఖర్చులు భారీగా తగ్గాయి. ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ కూడా ఇండియాలో తయారై, తక్కువ ధరకు మార్కెట్లోకి వచ్చి సక్సెస్ అయ్యింది. దీంతో వచ్చే ఐఫోన్‌లు కూడా భారత్ నుంచి తక్కువ ధరకు అందుబాటులో ఉండవచ్చని తెలుస్తోంది.
స్నేహితుల ద్వారా
ఈ సుంకాల కారణంగా అమెరికాలో ఐఫోన్ ధరలు 43% వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా iPhone 16 Pro Max సహా పలు ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా ప్రవాస భారతీయులు భారతదేశం నుంచి ఐఫోన్ కొనుగోలు చేయాలని అడిగే ఛాన్స్ ఉందని ఆయా వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో ఐఫోన్ ధరలు పెరిగితే ప్రవాస భారతీయులు భారతదేశంలో తమ బంధువులు లేదా స్నేహితుల ద్వారా ఐఫోన్‌లను కొనుగోలు చేయాలని కోరే అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ పరిణామాల వల్ల
ప్రస్తుతం ఐఫోన్‌లు అమెరికాలో $1000 (రూ.85,405) లేదా అంతకంటే ఎక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. కానీ భారతదేశంలో ఐఫోన్‌ల ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. కాబట్టి NRIలు త్వరలో ఐఫోన్‌లను భారతదేశం నుంచి కొనుగోలు చేసి ఖర్చులను తగ్గించుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈ సుంకాల పరిణామాల వల్ల అమెరికాలో జాతీయ స్థాయిలో ఐఫోన్ ధరలు పెరిగినా, ప్రజలు ఈ ధరల పెరుగుదల వల్ల ఉత్పత్తుల కొనుగోలుపై నిర్ణయాల తీసుకోవడంలో మరింత జాగ్రత్తగా ఉండే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News