Indian Railways: ఇండియన్ రైల్వే నుంచి కొత్త యాప్ 'స్వారైల్'..ఇకపై అన్నీ కూడా..
ABN , Publish Date - Mar 23 , 2025 | 05:24 PM
భారతీయ రైల్వే నుంచి క్రేజీ యాప్ వచ్చేస్తుంది. అదే 'స్వారైల్' సూపర్ యాప్. దీని ద్వారా ప్రయాణీకులు రైల్వేకు సంబంధించిన అన్ని సేవలను పొందవచ్చని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

భారతీయ రైల్వే వినియోగదారుల ప్రయాణ అనుభవాన్ని మరింత ఈజీగా చేసేందుకు ఒక కొత్త సూపర్ యాప్ 'స్వారైల్(Swarail)'ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం బీటా టెస్ట్ దశలో ఉన్న ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ సూపర్ యాప్ ముఖ్య ఉద్దేశ్యం రైల్వే సేవలను ఒకే చోట కేంద్రీకరించడం. దీంతో ప్రయాణీకులు రిజర్వేషన్, జనరల్, ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు మొదలైన వాటిని ఒకే యాప్ నుంచి బుక్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఈ యాప్ ప్రయాణికులకు ఇతర సౌకర్యాలను కూడా అందించనుంది.
సులభమైన టికెట్ బుకింగ్
స్వారైల్ యాప్ మీ రైలు టికెట్ బుకింగ్ అవసరాలను సులభతరం చేస్తుంది. మీరు రిజర్వేషన్ టిక్కెట్లు, జనరల్ టిక్కెట్లు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు అన్ని ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లోని హోమ్ స్క్రీన్ ద్వారా మీరు అన్ని రైల్ టిక్కెట్ బుకింగ్ ఆప్షన్లను ఈజీగా పొందవచ్చు.
రైల్ కనెక్ట్, యూటీఎస్ ఫీచర్ల సమన్వయం
స్వారైల్ యాప్ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) ద్వారా అభివృద్ధి చేయబడింది. ఇది IRCTC రైల్‌కనెక్ట్ యాప్, UTS ఆన్ మొబైల్ అప్లికేషన్ లను సమన్వయం చేస్తుంది. దీంతో యాప్ వినియోగదారులకు ఆన్‌లైన్ రిజర్వేషన్, ఆన్‌లైన్ టికెట్ చార్ట్, కోచ్ పొజిషన్ వంటి అనేక సౌకర్యాలను అందిస్తుంది.
రన్నింగ్ స్టేటస్
ప్రయాణికులు తమ రైలు ప్రత్యక్ష రన్నింగ్ స్టేటస్‌ను కూడా సులభంగా తెలుసుకోవచ్చు. రైలు ఆలస్యం లేదా మార్పులు జరిగితే, స్వారైల్ యాప్ వెంటనే తెలియజేస్తుంది. తద్వారా ప్రయాణికులు తమ ప్రణాళికలను సులభంగా సర్దుబాటు చేసుకోవచ్చు.
కోచ్ పొజిషన్ & రిజర్వేషన్ చార్ట్
మీరు కోచ్‌లో ఉన్న మీ స్థానాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఇది ప్రయాణికులకు ఏది కావాలన్నా అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. దీంతో, రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా జరుగుతుంది.
పుడ్ ఆర్డర్
మీరు ప్రయాణం చేస్తూ మీకు ఆహారం కావాలంటే, ఈ యాప్ ద్వారా ఫుడ్ ఆన్ ట్రాక్ లేదా ఇ-క్యాటరింగ్ సేవలను ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది దాదాపు ప్రతి రైలు ప్రయాణానికి అందుబాటులో ఉంటుంది. ఈ సౌకర్యం ప్రయాణీకుల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
పార్సెల్ సేవలు
స్వారైల్ యాప్ ద్వారా ప్రయాణికులు తమ పార్సెల్‌లు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది మీరు రైలు ద్వారా సులభంగా డెలివరీ చేయవలసిన వస్తువులను పంపించేందుకు సహాయపడుతుంది.
రైలు సహాయం
ప్రయాణీకులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నా, ఈ యాప్ ద్వారా రైలు సహాయాన్ని పొందవచ్చు. అర్థం కానీ పరిస్థితుల్లో లేదా ఎమర్జెన్సీ లో సహాయం కోరుకోవడానికి స్వారైల్ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఒకే చోట..
ఈ క్రమంలో స్వారైల్ యాప్ ప్రయాణీకులకు అన్ని రైల్వే అవసరాలను నిర్వహించడానికి అవకాశం కల్పిస్తుంది. దీంతో గతంలో రైలు టికెట్ బుకింగ్, పీఎన్ఆర్ విచారణ, ఫుడ్ ఆర్డర్, లైవ్ ట్రైన్ స్టేటస్ లాంటి సేవలకు వేర్వేరు యాప్‌లు అవసరం అయ్యేవి. కానీ ఇప్పుడు, ఈ సూపర్ యాప్ ద్వారా అన్నింటిని ఒకే చోట నుంచి నిర్వహించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Onion Prices: గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..
Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News

మొదట ఈ నగరంలోనే BSNL 5జీ సేవలు..కంపెనీ సీఎండీ వెల్లడి

బిగ్ డీల్..ఐఫోన్ 16పై 25 వేలకుపైగా తగ్గింపు ఆఫర్..

గ్రోక్ 3లో ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్ మామూలుగా లేదుగా..

- కలెక్టర్, వైద్యాధికారుల తనిఖీలతో గాడిన పడుతున్న సిబ్బంది

ఆపిల్ సిరీస్ వాచ్‌లలో క్రేజీ ఫీచర్..కెమెరాలు అమర్చాలని..
