Share News

iPhone 17: టెక్ ప్రియులకు అలర్ట్..ఐఫోన్ కొత్త మోడల్ లాంచ్ డేట్, ఫీచర్స్ లీక్

ABN , Publish Date - Mar 31 , 2025 | 05:51 PM

టెక్ ప్రియులకు గుడ్ న్యూస్. మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి కొత్త మోడల్ ఐఫోన్ రానుంది. అవును ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ విడుదల చేసిన సంస్థ, అదే జోరుతో ఐఫోన్ 17ను కొత్త ఫీచర్లతో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

 iPhone 17: టెక్ ప్రియులకు అలర్ట్..ఐఫోన్ కొత్త మోడల్ లాంచ్ డేట్, ఫీచర్స్ లీక్
iPhone 17 Series Launch Features

ఆపిల్ ఐఫోన్ ప్రియులకు క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ క్రమంలోనే ఐఫోన్ 17 సిరీస్ రిలీజ్ గురించి కీలక సమాచారం తెలిసింది. ఈ క్రమంలో ఐఫోన్ 17 సిరీస్‌ను సెప్టెంబర్-అక్టోబర్ నెలలో ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త సిరీస్ రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఇప్పటికే దీని ఫీచర్ల గురించి చాలా చర్చలు మొదలయ్యాయి. ఈ కొత్త సిరీస్‌లో నాలుగు ఐఫోన్‌లను విడుదల చేయనున్నారు. వీటిలో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఉంటాయి. ఈసారి కంపెనీ ప్లస్ మోడల్‌కు బదులుగా ఐఫోన్ 17 ఎయిర్‌ను జాబితాలో చేర్చారు.


సన్నని స్టైల్..

ఈసారి కంపెనీ ఐఫోన్ 17 సిరీస్ డిజైన్‌లో కీలక మార్పు చేయనుందని తెలుస్తోంది. రాబోయే ఐఫోన్‌ మందం తగ్గుతుందని, మునుపటి కంటే చాలా సన్నగా ఉంటాయని టెక్ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో ఐఫోన్ 17 సిరీస్ ఫోన్‌ మందం 5mm నుంచి 6.25mm మధ్య ఉండవచ్చని సమాచారం. కొత్త సిరీస్ ఐఫోన్ బేస్ వేరియంట్ 6.1 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉండగా, ప్రో సిరీస్ 6.6 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉండనుంది.


ఫోటోగ్రఫీ కోసం

ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ సిరీస్‌ను ఒకే కెమెరా సెటప్‌తో లాంచ్ చేయనుంది. ఈసారి పూర్తిగా భిన్నమైన కెమెరా మాడ్యూల్‌ను కొత్త సిరీస్ ఐఫోన్‌లలో చూడవచ్చు. మరోవైపు, ప్రో మోడల్‌లో దీర్ఘచతురస్రాకార కెమెరా బార్ అందుబాటులో ఉంటుంది. ఈసారి కంపెనీ సిరీస్‌లోని అన్ని ఐఫోన్‌లలో 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయనుంది. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్‌లలో పనితీరు కోసం A19 చిప్‌సెట్‌ రానుంది. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్‌లలో ఫోటోగ్రఫీ కోసం 48MP సెన్సార్ ఉండనుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం, రెండు మోడళ్లలోనూ 24MP కెమెరా అందుబాటులో ఉంటుంది.


ఐఫోన్ 17 సిరీస్ ధర

ప్రస్తుతం, ఐఫోన్ 17 సిరీస్ ధరకు సంబంధించి ఆపిల్ ఎటువంటి సమాచారాన్ని ప్రకటించలేదు. కానీ లీక్‌ల ప్రకారం, ఐఫోన్ 17 సిరీస్ బేస్ వేరియంట్ ధర రూ. 79,900 నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ ధర రూ. 1,44,900 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. మొత్తంగా కంపెనీ రాబోయే సిరీస్‌ను సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయవచ్చని టెక్ వర్గాలు అంటున్నాయి.


ఇవి కూడా చదవండి:

Minimum Bank Balance: సామాన్యులకు షాకింగ్..ఏప్రిల్ 1 నుంచి మినిమం బ్యాలెన్స్ పేరుతో బ్యాంకుల బాదుడు..

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..


New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక


Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..


Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 31 , 2025 | 05:54 PM