Share News

Mr Beast: మోకాళ్లపై కూర్చుని ప్రియురాలికి మిస్టర్ బీస్ట్ సర్‍‌ప్రైజ్.. పిక్స్ వైరల్

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:25 PM

ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ గురించి టెక్ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తన ప్రియురాలికి మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశారు. అందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Mr Beast: మోకాళ్లపై కూర్చుని ప్రియురాలికి మిస్టర్ బీస్ట్ సర్‍‌ప్రైజ్.. పిక్స్ వైరల్
Mr Beast Thea Booysen

ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్‌ (Mr Beast) గురించి కొత్త సంవత్సరంలో కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. బీస్ట్ మోకాళ్లపై కూర్చుని తన ప్రియురాలికి ప్రపోజ్ చేశారు. జనవరి 1, 2025న బీస్ట్ (అసలు పేరు జిమ్మీ డోనాల్డ్‌సన్) (Jimmy Donaldson) స్నేహితురాలు థియా బూయ్‌సెన్‌(Thea Booysen)కు ప్రపోజ్ చేసి తన నిశ్చితార్థాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ అప్‌డేట్‌తో ఆయన అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్‌పై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కూడా స్పందించారు. వావ్ అభినందనలు (రెడ్ హార్ట్ ఎమోజితో) అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్వీట్ కొన్ని గంటల్లోనే 23 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించింది. దీంతోపాటు అనేక మంది అభిమానులు వీరికి విషెస్ తెలియజేస్తున్నారు.


వీడియో చుశారా..

సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ దక్కించుకున్న ఈ స్టార్ తన నిశ్చితార్థం వేడుకను ప్రత్యేకంగా, చిన్నదిగా ఉండాలని కోరుకున్నారు. ఈ క్రమంలో తన ప్రియురాలి చేతికి ఉంగరం తొడిగి, తన మోకాళ్లపై కూర్చోబెట్టుకుని ప్రపోజ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో థియా తన చేతికి తొడిగిన ఉంగరాన్ని చూపించారు. అయితే ఈ వేడకను తక్కువ మంది సమక్షంలో ప్రైవేటుగా నిర్వహించుకోవాలని అనుకున్నట్లు బీస్ట్ వెల్లడించారు. బీస్ట్ ఛాలెంజ్‌లు, పెద్ద పెద్ద విన్యాసాలు చేయడంలో ఎంతో ప్రసిద్ధి చెందారు.


వీరి పరిచయం ఎప్పుడంటే..

మిస్టర్ బీస్ట్ 2022లో తన స్వదేశాన్ని సందర్శించినప్పుడు తోటి దక్షిణాఫ్రికా గేమర్ అయిన థియాను కలిశాడు. ఆ క్రమంలో ఏర్పడిన వీరి పరిచయం కాస్తా, క్రమంగా ప్రేమగా మారింది. ఆ నేపథ్యంలో వీరు టూర్లు, పర్యటనలకు వెళ్లేవారు. యూట్యూబర్‌లందరూ ఒక రకమైన వ్యక్తిత్వం కల్గి ఉంటారని తాను మొదట అనుకున్నానని థియా తెలిపారు. కానీ బీస్ట్‌ను కలిసినప్పుడు చాలా ఆశ్చర్య పోయానని, ఆయన చాలా తెలివైన మంచి వ్యక్తి అని ఆమె అన్నారు. MrBeast గత సంవత్సరం భారతదేశానికి వచ్చారు. భారతదేశ పర్యటనలో భాగంగా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులను కలిశారు.


ఇవి కూడా చదవండి:

ChatGPT: వినియోగదారుల కోసం చాట్‌జీపీటీ నుంచి వీడియో ఇంటరాక్షన్ ఫీచర్‌

WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..

Smart Phone Tips: మీ మొబైల్ విషయంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..

Spam Calls: స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్‌ చేస్తే చాలు.. స్పామ్ కాల్స్ నుంచి రిలీఫ్...

For More Technology News and Telugu News

Updated Date - Jan 02 , 2025 | 01:46 PM