Share News

Ghibli-style AI images: ChatGPT నయా సంచలనం.. ట్రెండింగ్‌లో ఘిబ్లీ స్టైల్ ఇమేజ్ ఫీచర్.. ఫ్రీగా అందుబాటులోకి..

ABN , Publish Date - Mar 29 , 2025 | 04:28 PM

Ghibli images: ఇప్పుడు నెట్టింట్లో ఎక్కడ చూసినా ఘిబ్లీ స్టైల్ ఇమేజెస్ మెరుపులే. ఛాట్ జీపీటీ తీసుకొచ్చిన ఈ నయా ఇమేజ్ ఫీచర్ గురించే ఎక్కడ చూసినా చర్చ. ఇన్నాళ్లూ పెయిడ్ సబ్‌స్క్రైబర్‌లకే అందుబాటులో ఉన్న ఘిబ్లీ ఫీచర్ తాజాగా ఫ్రీగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. మరెందుకు ఆలస్యం. మీరూ ఫ్రీగా ఘిబ్లీ ఇమేజ్ జనరేట్ చేసేయండిలా..

Ghibli-style AI images: ChatGPT నయా సంచలనం.. ట్రెండింగ్‌లో ఘిబ్లీ స్టైల్ ఇమేజ్ ఫీచర్.. ఫ్రీగా అందుబాటులోకి..
Generate Ghibli art with AI free

How to generate Ghibli-style art : ఇన్ స్టా, ఫేస్‌బుక్, ఎక్స్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం చూసినా ఘిబ్లీ స్టైల్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. 48 గంటలుగా ప్రముఖ దేశాధినేతలు, సెలబ్రిటీలు, వైరల్ మీమ్స్ ఇలా ప్రతిదీ యానిమే రూపంలో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ChatGPT ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ స్టూడియో ఘిబ్లీ ఫీచర్ ఉచితంగా ఇప్పుడు ఫ్రీగా అందుబాటులోకి రావడంతో అందరూ తెగ వాడేస్తున్నారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన ఏ ఫొటోనైనా కళ్లు మూసి తెరిచేంతలోనే ఘిబ్లీ ఇమే‌జ్‌గా మార్చేసుకోవచ్చు. మీకూ వీటిని క్రియేట్ చేయాలనుందా.. మరి, ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామా..


ఘిబ్లీ ఆర్ట్ అంటే ఏమిటి?

స్టూడియో ఘిబ్లీ అనేది జపనీస్ యానిమేషన్ స్టూడియో. 1985లో హయావో మియాజాకి, ఇసావో టకాహటా, తోషియో సుజుకి ఘిబ్లీ యానిమేషన్ స్టూడియోను స్థాపించారు. జీబ్లీ స్టైల్లో చేతితో ఎన్నో రకాల యానిమేటెడ్ పాత్రలను సృష్టించి సిరీస్‌లు తీసుకొచ్చారు.


ఫ్రీగా ఘిబ్లీ ఇమేజెస్ సృష్టించవచ్చా?

మొదట్లో ChatGPT ఘిబ్లీ ఫీచర్ ఉచితంగానే ప్రవేశపెట్టింది. కానీ, ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ రావడంతో రోజుకు మూడు ఫొటోలే సృష్టించగలిగేలా పరిమితులు విధించింది. ప్రస్తుతం ChatGPT Plus, Pro, Team సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికే ఘిబ్లీ ఫీచర్ ఫ్రీగా అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు కొత్త యూజర్ అయితే నెలకు రూ. 1,712 ఖర్చు చేస్తే స్టూడియో ఘిబ్లీ చిత్రాలు ఉచితంగా క్రియేట్ చేసుకోవచ్చు. ChatGPTలో ఘిబ్లీ ఫొటోస్ క్రియేట్ చేయాలనుకుంటే మీరు నచ్చిన ఇమేజ్‌ను ఘిబ్లీ ఫై చేయమని గానీ లేదా ఘిబ్లీ థీమ్‌లోకి ఛేంజ్ చేయమని గానీ ప్రాంప్ట్ ఇవ్వాలి. లేటెస్ట్ వెర్షన్‌లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.


జెమినీ ఏఐ ద్వారా కూడా ఘిబ్లీ స్టైల్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ముందుగా మీరు జెమిని ఏఐ ప్లాట్ ఫాంలోకి లాగిన్ అవ్వాలి. ఛాట్ బాక్స్‌లో మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఇమేజ్ గురించి సంక్షిప్తంగా చెప్పి ఘిబ్లీ ఫై చేయమని ప్రాంప్ట్ ఇవ్వాలి. అంతే, ఏఐ ఇచ్చిన ఫొటోను వెంటనే ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసుకోవచ్చు.


గ్రోక్ ద్వారా కూడా ఘిబ్లీ స్టైల్ ఫొటోలు సృష్టించవచ్చు. ముందుగా గ్రోక్ వెబ్‌సైట్ లేదా యాప్‌లోకి వెళ్లి పేపర్ క్లిప్ ఐకాన్ క్లిక్ చేసి ఫొటో అప్లోడ్ చేయండి. ఏఐని ఇమేజ్ ని ఘిబ్లీ ఫై చేయమని అడగండి. వెంటనే ఘిబ్లీ స్టైల్ ఇమేజ్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు.


Read Also : WhatsApp: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. స్టేటస్‌ ప్రియులకు ఇక పండగే

Earthquake Alerts: భూకంపాన్ని ముందే తెలుసుకోండి..మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ చేసుకుంటే చాలు..

Crypto Exchange Apps: 17 క్రిప్టో ఎక్స్ఛేంజ్ యాప్స్ నిషేధం.. వీటిలో ఏవేవి ఉన్నాయంటే..

Updated Date - Mar 29 , 2025 | 04:39 PM