జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
ABN , Publish Date - Feb 25 , 2025 | 11:35 PM
మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉత్తర వాహిని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిం చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి సూ చించారు. మంగళవారం చెన్నూరులోని గోదా వరి తీరాన్ని పరిశీలించారు.
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్
చెన్నూరు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉత్తర వాహిని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిం చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి సూ చించారు. మంగళవారం చెన్నూరులోని గోదా వరి తీరాన్ని పరిశీలించారు. ఆయన మాట్లా డుతూ గోదావరి తీరంలో పారిశుధ్య కార్యక్ర మాలు నిర్వహించాలని, షామినా యాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కత్తెరసాల మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
జైపూర్ (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రిని పురస్కరించుకుని వేలాల జాతరకు వచ్చే భక్తులకు వీఐపీ పాస్‌లను బంద్ చేశామని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం వేలాలలో జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పోలీ సులు పంచాయతీరాజ్,దేవాదాయ శాఖ అధికారుల కృషితో జాతర ఏర్పాట్లను చేశార న్నారు. ఆయన వెంట ఏసీపీ వెంకటేశ్వర్, శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, ఎస్‌ఐ శ్రీధర్, ఈవో రమేష్ ఉన్నారు.
పట్టభద్రులకు ముఖ్యమంత్రి భరోసా
మందమర్రిటౌన్ (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పట్టభద్రులందరికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారని రానున్న రోజుల్లో మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌లు విడుదల చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకట స్వామి తెలిపారు. మంగళవారం పట్టణంలో ని 24వ వార్డు ఊరు మందమర్రిలో విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నా ప్రజా సంక్షేమ పథకలను అమలు చేస్తూనే మరో వైపు రాష్ట్ర ప్రగతి కోసం సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నా రన్నారు. ఈ నెల 27న జరగ నున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నరేందర్‌రెడ్డికి మొద టి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమావే శంలో కాంగ్రెస్ నాయకులు నోముల ఉపేందర్‌గౌడ్, బండి సదానందం యాదవ్, రావికంటి వెంకటేశం, మంద తిరుమల్, సంగి సంతోష్, రాచర్ల గణేష్ , నర్సింగ్, లక్ష్మణ్, పోశం పాల్గొన్నారు.
- పనుల పరిశీలన
పట్టణంలోని ఊరు మందమర్రిలో ప్రభు త్వ నిధులతో చేపడుతున్న రోడ్లు, డ్రైనేజీల పనులను కాలినడకన తిరుగుతూ ఎమ్మెల్యే పరిశీలించారు. మున్సిపల్ ఇంజనీర్‌తో పనుల విషయం గురించి చర్చించారు. నాణ్యతతో పనులను చేయాలని సూచించారు. ప్రజలు తాగునీటి సమస్య ఉందని, పింఛన్‌లు రావ డం లేదని ప్రజలు ఎమ్మెల్యేకు విన్నవించగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ నాయకులు, మున్సిప ల్ అధికారులు పాల్గొన్నారు.