Share News

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష

ABN , Publish Date - Feb 23 , 2025 | 11:33 PM

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే తెలిపారు.

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌రూరల్‌/సిర్పూర్‌(టి), ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రశాంత వాతావరణంలో గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పరీక్షకు హాజరైన అభ్యర్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యం కల్పించామన్నారు. 10 పరీక్షా కేంద్రాల్లో 3,893 మంది అభ్యర్థలకు గానూ 3828 మంది హాజరు కాగా 65 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.

- ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకోవాలి

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఈ నెల 27న జిల్లాలో జరుగనున్న పోలింగ్‌లో అర్హత గల ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సూచించారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పోలింగ్‌ రోజు సెలవు దినంగా ప్రకటించడం జరిగిందని, ప్రైవేటు ఉద్యోగులు తమ వీలు వెసులుబాటు చూసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 11:33 PM