Share News

ఉద్యోగులు సమయపాలన పాటించాలి

ABN , Publish Date - Feb 19 , 2025 | 11:24 PM

వివిధశాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాలని అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ సూచించారు.

ఉద్యోగులు సమయపాలన పాటించాలి
ఆర్డీవో కార్యాలయంలో రిజిస్టర్లను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌

అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌

బెల్లంపల్లి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): వివిధశాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాలని అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ సూచించారు. బుధవారం పట్టణం లోని ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సంద ర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అద నపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఉద్యోగుల సమయ పాలన పాటిస్తూ ప్రజా సమస్యల పరిష్కా రానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందేలా పకడ్బం దీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ భూముల పరిరక్షణకు కృషి చేయాలని ఎవరైనా భూము ల కబ్జాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హరికృష్ణ, అధికారులు పాల్గొన్నారు.

దివ్యాంగులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్న శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ సూచించారు. బుధవారం పట్టణంలోని సింగరేణి కళావేదికలో బెల్లంపల్లి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని మహిళ శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల కోసం ఎంపిక శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ఆయన హాజరై మాట్లాడారు. దివ్యాంగుల కోసం శిబిరాలను నిర్వహిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అనంతరం 300 మంది దివ్యాంగులకు అలింకో వారి సహకారంతో పరీక్షలు నిర్వహించారు. ఇందులో అవసరమైన దివ్యాంగులకు ఉపకరణాల కోసం ఫోన్‌ ద్వారా సమాచారం తెలియజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్‌, ఆర్డీవో హరికృష్ణ, సీడీపీవో స్వరూపరాణి ,సూపర్‌ వైజర్లు, దివ్యాంగులు పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2025 | 11:24 PM