Kumaram Bheem Asifabad: ఘనంగా బీమాకొరెగావ్ శౌర్య దివస్
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:23 PM
వాంకిడి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): బీమాకొరెగావ్ శౌర్యదివస్‌ను బుధవారం మండలంలోని వివిధగ్రామాల్లో ప్రజలు ఘనంగా జరుపుకొ న్నారు.
వాంకిడి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): బీమాకొరెగావ్ శౌర్యదివస్‌ను బుధవారం మండలంలోని వివిధగ్రామాల్లో ప్రజలు ఘనంగా జరుపుకొ న్నారు. ఈసందర్భంగా జేత్‌వాన్ బుద్ధవిహార్‌లో అంబేద్కర్, గౌతమ బుద్ధుడి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1818జనవరి 1న బీమాకొరెగావ్ గ్రామంలో సమానత్వం, ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటంలో కేవలం 500 మంది మహర్ సైనికులు 28,000మంది పిస్వ సైన్యాన్ని ఓడించా రని అన్నారు. ఈసంఘటనలో వీరమరణం పొందిన 22మంది భీమ్ సైనికులకు ఈసందర్భంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్, మండల నాయకులు జైరాం ఉప్రె, దుర్గం శ్యాంరావు, విలాస్, రాజేంద్రప్రసాద్, దుర్గం ప్రశాంత్, రోషన్, ప్రతాప్, పాండుజీ, రాజేశ్వర్,అంబేడ్కర్‌సంఘం నాయకులు పాల్గొన్నారు.