Share News

Kumaram Bheem Asifabad: బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేయాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ABN , Publish Date - Jan 09 , 2025 | 10:32 PM

కాగజ్‌నగర్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

 Kumaram Bheem Asifabad: బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేయాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

-ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

కాగజ్‌నగర్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం రాత్రి కాగజ్‌నగర్‌ మండలం ఈసుగాం క్యాంపులో ఆయన మాట్లాడారు. నజ్రూల్‌నగర్‌లో చెరువులున్నప్పటికీ కాల్వల పరిస్థితి బాగా లేదన్నారు. అడ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న కాల్వలను ఇంతవరకు పూర్తి చేయలేదన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఏ మాత్రం పట్టించు కోవడం లేదన్నారు. అడ ప్రాజెక్టు నీళ్లు వదిలితే క్యాంపువాసులకు పుష్కలమైన నీరు వస్తుందన్నారు. తద్వారా ఏడాదికి మూడు పూటలు పండించే అవకాశం ఉందన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ సిర్పూరు తాలుకా కన్వీనర్‌ లెండుగురే శ్యాంరావు, నాయకులు పాల్గొన్నారు.

వనభోజనానికి హాజరైన ఆర్‌ఎస్పీ: కాగజ్‌నగర్‌ మండలం ఈసుగాం బసంతినగర్‌లో ఏర్పాటుచేసిన వనభోజన కార్యక్ర మానికి గురువారం ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజల్లో పాల్గొన్నారు.

పరామర్శ: కాగజ్‌నగర్‌ అన్నపూర్ణ హోటల్‌ యాజమాని సుదగొని జగదీష్‌గౌడ్‌ గుండెపోటుతో ఇటీవల మృతి చెందగా గురువారం ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆయన కుటుంబీకులను పరామర్శించారు. తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

Updated Date - Jan 09 , 2025 | 10:32 PM