Share News

Kumaram Bheem Asifabad: అటవీకేసుల పరిష్కారానికి సరైన విధానం పాటించాలి

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:24 PM

సిర్పూరు(టి), జనవరి 1 (ఆంధ్రజ్యోతి): అటవీ కేసుల పరిష్కారం కోసం సిబ్బంది నిర్ణీత విధానాన్ని పాటించాలని జిల్లా జడ్జి ఎంవీ రమేష్‌ అన్నారు.

Kumaram Bheem Asifabad:   అటవీకేసుల పరిష్కారానికి సరైన విధానం పాటించాలి

-జిల్లా జడ్జి ఎంవీ రమేష్‌

సిర్పూరు(టి), జనవరి 1 (ఆంధ్రజ్యోతి): అటవీ కేసుల పరిష్కారం కోసం సిబ్బంది నిర్ణీత విధానాన్ని పాటించాలని జిల్లా జడ్జి ఎంవీ రమేష్‌ అన్నారు. కాగజ్‌నగర్‌లోని వేంపల్లి టింబర్‌ డిపో ఆవరణలో సిబ్బందితో అటవీకేసుల పరిష్కారానికి జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్‌కుమార్‌ టిబ్రేవాల్‌ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడవి జంతువులను వేటాడం నేరమన్నారు. ఇటు వంటి కేసుల సత్వర పరిష్కారం కోసం సిబ్బంది అవసరమైన సాక్ష్యాలను త్వరగా ప్రవేశపెట్టాలన్నారు. సమావేశంలో సినియర్‌ సివిల్‌ జడ్జి యువరాజు, జూనియర్‌ సివిల్‌జడ్జి అనంత లక్ష్మి, ఎఫ్‌డీవో, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 11:24 PM