Kumaram Bheem Asifabad: ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:26 PM
ఆసిఫాబాద్, జనవరి 1(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంతోపాటు మండలంలో 2025 నూతనసంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఆసిఫాబాద్, జనవరి 1(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంతోపాటు మండలంలో 2025 నూతనసంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల తరువాత కొత్తసంవత్సరానికి స్వాగతం పలుకుతూ అన్నివర్గాల ప్రజలు ఆనందోత్సాహాల మధ్యవేడుకలను నిర్వహిం చారు. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా ఆయాల్లో ప్రత్యేకపూజలు నిర్వ హించారు. భక్తులతో ఆలయాలు కిటకిట లాడాయి. కలెక్టర్ వెంకటేష్ దోత్రే కుటుంబ సభ్యులతో కలిసి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్‌ను కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధశుక్లా మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి బెల్లంపల్లి ఏరియా జీఎం శ్రీనివాస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ పట్టణంలో యువకులు డ్యాన్సులు చేశారు. కేక్‌కట్ చేసి సంబరాలు జరిపారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోస్తు నిర్వహించారు.
వాంకిడి/కెరమెరి/బెజ్జూరు/చింతలమానేపల్లి/సిర్పూర్(టి)/దహెగాం/కౌటాల: మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి 12గంటలు దాటాక యువకులు కేక్‌లు కట్‌చేసి టపాసులు పేల్చి నూతనసంవత్సర సంబరాలు జరుపుకున్నారు.
బంధువులు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు బుధవారం ఇళ్లముందు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ముగ్గులు వేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.