Share News

Kumaram Bheem Asifabad: ఘనంగా వైకుంఠ ఏకాదశి

ABN , Publish Date - Jan 10 , 2025 | 11:19 PM

ఆసిఫాబాద్‌, జనవరి 10(ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను శుక్రవారం భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.

 Kumaram Bheem Asifabad: ఘనంగా వైకుంఠ ఏకాదశి

ఆసిఫాబాద్‌, జనవరి 10(ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను శుక్రవారం భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే పుణ్య స్నానాలు ఆచరించి ఆలయాల్లో ప్రత్యేకపూజలను నిర్వహిం చారు. పట్టణంలోని ప్రధానఆలయాలు భక్తులతో కిటకిట లాడాయి. ఆలయాల్లో అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాల్లో పూజ లను నిర్వహించారు. స్థానిక శ్రీలక్ష్మినారాయణ స్వామి ఆలయంలో సాముహిక సత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహిం చారు. వేదపండితుడు మహేశ్వరశాస్త్రి ఆధ్వర్యంలో పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

బెజ్జూరు: మండలంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండలకేంద్రంలోని రంగనాయక ఆలయంలో భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకున్నారు.

ఈ సందర్భంగా రంగనాథుడిని వివిధ రకాలపూలతో అందంగా అలంకరించారు. మండంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 11:19 PM