Kumaram Bheem Asifabad: గురుకులం పిలుస్తోంది
ABN , Publish Date - Jan 15 , 2025 | 10:42 PM
బెజ్జూరు, జనవరి 15(ఆంధ్రజ్యోతి): విద్యాసంవత్సరం(2025-26)లో గురుకుల పాఠశాలల్లో చేపట్టే ప్రవేశాలకు ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఈ ఏడాది చేరికల్లో కొన్ని మార్పులు చేసింది.
- ఫిబ్రవరి 23న అర్హత పరీక్ష
- ఫిబ్రవరి ఒకటి చివరి గడువు
- ఈ ఏడాది నుంచి ఐదు నుంచి తొమ్మిది తరగతులకు ఒకేసారి దరఖాస్తుల స్వీకరణ, అర్హత పరీక్ష
బెజ్జూరు, జనవరి 15(ఆంధ్రజ్యోతి): విద్యాసంవత్సరం(2025-26)లో గురుకుల పాఠశాలల్లో చేపట్టే ప్రవేశాలకు ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఈ ఏడాది చేరికల్లో కొన్ని మార్పులు చేసింది. గతంలో ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ ఉంటే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఈ ఏడాది నుంచి కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాలను ముందే సమర్పించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఐదో తరగతి ఒకసారి, ఆరునుంచి తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలకు మరోవిడత దరఖాస్తుల స్వీకరణ ఉండేది. అర్హత పరీక్షలు సైతం వేర్వేరు తేదీల్లో నిర్వహించేవారు. ఈ ఏడాది నుంచి ఐదు నుంచి తొమ్మిది తరగతులకు ఒకేసారి దరఖాస్తుల స్వీకరణ, అర్హత పరీక్ష నిర్వహించే ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల గురుకులాలు మొత్తం మహాత్మా జ్యోతిబాఫూలే 26, సాంఘిక సంక్షేమ 22, మైనార్టీ సంక్షేమ 14, గిరిజన సంక్షేమ 22 పాఠశాలలు ఉన్నాయి.
ఫిబ్రవరి ఒకటి చివరి గడువు..
2024 డిసెంబరు 21వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఇంటర్నెట్‌లో గడువు ముగింపు తేదీ 1-02-2025వరకు ఉంది. ఫిబ్రవరి 23 2025న ఎంపిక చేసిన కేంద్రాల్లో అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా 2025-26విద్యా సంవత్సరానికి గురుకులంలో పైతరగతులకు దరఖాస్తులు చేసుకోవాలనుకునే విద్యార్థులు మీ-సేవా కేంద్రాల ద్వారా ముందుగా కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాలు పొందాల్సి ఉంటుంది.
అవసరం ఉన్నవి..
ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి బోనఫైడ్ లేదా జనన ధ్రువీకరణ పత్రం జతచేయాలి. ఆధార్‌కార్డుతో పాటు మొబైల్ నంబరు ఒక దరఖాస్తుకు మాత్రమే పనిచేస్తుంది. విద్యార్థి ఫొటోతోపాటు గ్రామీణ ప్రజల వార్షిక ఆదాయం రూ.1.50లక్షలు ఉండాలి. పట్టణ ప్రజల వార్షిక ఆదాయం రూ.2లక్షలలోపు మాత్రమే ఉండాలి.
ఆయా తరగతుల దరఖాస్తుకు కింది తేదీల మధ్య జన్మించిన వారు అర్హులు..
తరగతి తేదీ నుంచి వరకు
ఐదు 01-09-2012 31-08-2016
ఆరు 01-09-2011 31-08-2015
ఏడు 01-09-2010 31-08-2014
ఎనిమిది 01-09-2009 31-08-2013
తొమ్మిది 01-09-2008 31-08-2012