Kumaram Bheem Asifabad: ఘనంగా శ్రీగోదారంగనాథస్వామి కల్యాణం
ABN , Publish Date - Jan 13 , 2025 | 10:58 PM
కాగజ్‌నగర్, జనవరి 13(ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ ఆర్‌ఆర్‌వో కాలనీలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం శ్రీగోదాదేవి రంగనాథస్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది.
కాగజ్‌నగర్, జనవరి 13(ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ ఆర్‌ఆర్‌వో కాలనీలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం శ్రీగోదాదేవి రంగనాథస్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. వేద పండితుడు నరహరిశర్మ ఆధ్వర్యంలో కల్యాణాన్ని నిర్వహించారు. పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్పీఎం జీఎం ఎంఎస్ గిరి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయకమిటీ సభ్యులు, నిర్వాహకులు, దాతలు, ఆయావార్డులకు చెందిన భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.