Share News

Kumaram Bheem Asifabad: క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితా రూపొందించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Jan 15 , 2025 | 10:45 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 15(ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వసంక్షేమ పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇతర పథకాలపై క్షేత్రస్థాయిలో సమగ్రపరిశీలన జరిపి గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబి తాను రూపొందించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

Kumaram Bheem Asifabad: క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితా రూపొందించాలి: కలెక్టర్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 15(ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వసంక్షేమ పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇతర పథకాలపై క్షేత్రస్థాయిలో సమగ్రపరిశీలన జరిపి గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబి తాను రూపొందించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌లు దీపక్‌ తివారి,డేవిడ్‌తో కలిసి ప్రత్యేకాధికారులు, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏవోలు, కార్యదర్శులు, జిల్లా అధికారులతో ప్రభుత్వసంక్షేమ పథకాల అమలుపై సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాసంక్షేమ పథకాల అమలు ద్వారా జిల్లాలోని అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథ కాల ఫలాలు అందేలా అధికారులు కృషి చేయాలని తెలి పారు. ప్రభుత్వం ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమలు చేస్తున్న పథకాలలో అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించడంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఇందరిమ్మ ఆత్మీయ భసోరా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేష న్‌కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తుదారులలో అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఈ నెల16నుంచి 19వతేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలనజరిపి జాబితాను రూపొందించాలని తెలిపారు. ఈనెల21, 22తేదీల్లో గ్రామసభలో జాబితా ఆమోదం ద్వారా అర్హుల జాబితాను జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అందించాలన్నారు. రేషన్‌ కార్డుల కోసం వచ్చన దరఖాస్తుల పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారి వార్షిక ఆదాయం రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి రూ.2లక్షలు మించి ఉండకూడదన్నారు. రేషన్‌ కార్డులకోసం పేర్ల తొలగింపులు, చేర్పులు, నూతన కార్డు ల కోసం అర్హతగలవారి జాబితాను రూపొందించా లన్నారు. వారి ఆదాయ వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లసర్వేప్రక్రియ జిల్లాలో 97శాతం పూర్తి అయిందని, మిగితా వారి వివరాలను నమోదు చేయాలని తెలిపారు. అర్హులైన వారిజాబితా రూపొందిం చి మరోసారి క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించాలన్నారు.

Updated Date - Jan 15 , 2025 | 10:45 PM