Share News

Kumaram Bheem Asifabad: కొనసాగుతున్న ఆపరేషన్‌ స్మైల్‌

ABN , Publish Date - Jan 09 , 2025 | 10:54 PM

చింతలమానేపల్లి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేం దుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

Kumaram Bheem Asifabad: కొనసాగుతున్న ఆపరేషన్‌ స్మైల్‌

- బాల కార్మికుల విముక్తి కోసం రెండు బృందాలు

- బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు

- జిల్లాలో 335 జీపీలు, రెండు మున్సిపాలిటీలు

చింతలమానేపల్లి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేం దుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఏటా జనవరిలో ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమం చేపడుతోంది. జిల్లాలో జనవరి1 నుంచి 11వ విడత కార్యక్రమం ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. బాలకార్మికుల స్థావరాలుగా నిలిచే వ్యాపార సముదాయాలు, గోదాములు, కిరాణా షాపులు, పరిశ్రమలు, హోటళ్లు, మెకానిక్‌ షాపులు, ఇటుక బట్టీలు, ఫెర్టిలైజర్‌ షాపులు ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. గతేడాది ఈకార్యక్రమం ద్వారా జిల్లావ్యాప్తంగా మొత్తం 68మంది చిన్నారులను గుర్తిం చారు. వీరిలో బాలకార్మికులు 58మంది ఉండగా, బాల్య వివాహం చేసుకున్న వారు ముగ్గురు, బడిమానేసిన పిల్లలలు ఏడుగురు ఉన్నారు. ఈ యేడాది ఇప్పటివరకు 16మంది బాలకార్మికులను గుర్తించారు. వారిలో 12మందికి చెందిన తల్లి దండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి చిన్నారులను అప్పగించారు. మిగితా నలుగురిని వసతిగృహంలో చేర్పించారు.

జిల్లాలో రెండు బృందాలు..

జిల్లా పరిధిలో 15మండలాలు ఉండగా, 335గ్రామపంచాయ తీలు, కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలున్నాయి. ఆసిఫా బాద్‌ జిల్లా వ్యాప్తంగా రెండు బృందాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ వెంటేష్‌దోత్రే నేతృత్వంలో జిల్లాపోలీస్‌ అధికారులు, కార్మిక, బాలల హక్కుల పరిరక్షణ సమితి, శిశు సంరక్షణ, విద్యాశాఖల సమన్వయంతో ఈ బృందాలు పని చేస్తున్నాయి. ఈ బృందాల్లో ఎస్సై స్థాయి అధికారి, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి, ఇద్దరు కానిస్టేబుళ్లు, మరో మహిళా కానిస్టేబుల్‌, కార్మికశాఖ నుంచి ఒకరిని నియమించి ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమం చేప డుతున్నారు. చిన్నారుల తల్లిదండ్రులకు, బంధువులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి బాలలకు బాసటగా నిలుస్తారు. అనాథ బాలికలను జిల్లాకేంద్రంలోని వసతి గృహంలో చేర్పించి వారికి విద్య, వైద్యం, వసతి, భోజనం వంటివి ఏర్పాటు చేస్తారు. దీనిద్వారా వారు విద్యావంతులుగా మారే అవకాశం ఉన్నది.

కార్యక్రమ విజయవంతానికి ప్రణాళికలు..

జిల్లావ్యాప్తంగా ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమ విజయవంతానికి జిల్లా యంత్రాగం సమావేశాలు ఏర్పాటు చేసి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. రెండుబృందాల ఏర్పాటుతో పాటు చైల్డ్‌ట్రాక్‌ పోర్టల్‌, ముఖ కదలికలను గుర్తించే దర్పణ్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. బాల కార్మి కులను గుర్తించి సమాచారం అందించేందుకు హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1098పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

బాలకార్మికులను గుర్తిస్తే సమాచారం ఇవ్వాలి..

- బి మహేష్‌, డీసీపీవో

జిల్లావ్యాప్తంగా ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమం కొనసాగుతోంది.

గతేడాది 68మందిని గుర్తించాం. బాలలను పనుల్లో పెట్టుకుంటే చట్టప్రకారం కేసులు నమోదు చేయడమే కాకుండా వారిపై చర్యలు తీసుకుంటాం. జిల్లా యంత్రాగం సహకారంతో పకడ్బందీగా చర్యలు చేపడుతున్నాం. ఎక్కడైనా కార్మికులను గుర్తిస్తే వెంటనే డయల్‌ 100లేదా 1098 టోల్‌ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలి.

Updated Date - Jan 09 , 2025 | 10:54 PM