Share News

Kumaram Bheem Asifabad: అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

ABN , Publish Date - Jan 15 , 2025 | 10:43 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మకర సంక్రాంతి పర్వదినాన్ని మంగళవారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.

Kumaram Bheem Asifabad:  అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

- జిల్లా వ్యాప్తంగా ఘనంగా వేడుకలు

- ప్రత్యేక పూజలు.. నోములు.. వ్రతాలు

- తీరొక్క రంగుల ముగ్గులతో అందంగా లోగిళ్లు

ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మకర సంక్రాంతి పర్వదినాన్ని మంగళవారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో పండగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని మహిళలు తమ ఇళ్ల లోగిళ్ల ముందు రంగు రంగుల ముగ్గులను వేసి అందంగా తిర్చిదిద్ది గొబ్బెమ్మలను పూలతో అం దంగా అలంకరించి ముగ్గుల మధ్యలో పెట్టారు. పిండి వంటలను తయారు చేశారు. అయ్యప్ప ఆలయంలో భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించి దీపోత్సవ కార్యక్ర మాన్ని చేపట్టారు. మహిళలు తమ ఇళ్లలో ప్రత్యేక నోములు నోచుకుంటూ వాయినాలను ఇచ్చిపుచ్చుకు న్నారు. అలాగే యువకులు, చిన్నారులు పతంగులు ఎగురవేసి ఆనందంగా గడిపారు. బాబాపూర్‌ గ్రామం లో నవనిర్మాణయూత్‌ ఆధ్వర్యంలో ఎండ్ల బండ్లు, కబడ్డీపోటీలను నిర్వహించారు. ఎండ్లబండి పోటీల్లో మొదటి బహుమతి మంచిర్యాల జిల్లా టేకులపల్లి గ్రామానికి చెందిన మల్లేష్‌, ద్వితీయ బహుమతి ఆసిఫాబాద్‌ మండలం దడ్పపూర్‌ గ్రామానికి చెందిన ఉప్పరి రాజేష్‌ గెలుపొందారు. అలాగే కబడ్డీ పోటీల్లో మాణిక్‌గూడ మొదటిస్థానం, ద్వితీయస్థానం వాంకిడి జట్టు గెలుపొందాయి. విజేతలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీ అధ్యక్షుడు కొక్కి రాల విశ్వప్రసాద్‌రావు, సింగిల్‌విండో ఛైర్మన్‌ అలీబీన్‌ ఆహ్మద్‌, మాజీఎంపీపీలు బాలేశ్వర్‌గౌడ్‌, మల్లిఖార్జున్‌ యాదవ్‌, మార్కెట్‌కమిటీ మాజీచైర్మన్‌ గాదవేణి మల్లేష్‌ అందజేశారు. వేర్వేరుగా జరిగిన ఆయా కార్య క్రమాల్లో బీఆర్‌ఎస్‌పార్టీ మండల అధ్యక్షుడు జబరి రవిందర్‌, మాజీసర్పంచులు లక్ష్మి,బలరాం, తదితరులు పాల్గొన్నారు.

మండలాల్లో..

బెజ్జూరు/చింతలమానేపల్లి/పెంచికలపేట/కెరమెరి/దహెగాం/సిర్పూర్‌(టి): మండలాల్లోని ఆయాగ్రామాల్లో ఇళ్లముందు వివిధరకాల ఆకృతులతో అందమైన రంగువల్లులు వేశారు. చిన్నారులు గాలి పటాలను ఎగురవేశారు. కనుమ పండగ రోజు మహి ళలు వివిధరకాల సామగ్రితో నోముకున్నారు. అనం తరం ఒకరికొకరు వాయినాలను ఇచ్చిప్పుచ్చుకు న్నారు. సంక్రాంతి సంబరాలు ఆయాగ్రామాల్లో చిన్న పెద్ద తేడాలేకుండా సంబరంగా జరుపుకున్నారు. పెంచికలపేట మండలకేంద్రంలో కాంగ్రెస్‌ నాయకుడు కృష్ణ ఆధ్వర్యంలో ముగ్గులపోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. యువకులు ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. దహెగాంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

వాంకిడి: మండలకేంద్రలోని ప్రభుత్వ ఆస్పత్రి మైదానంలో కాంగ్రెస్‌పార్టీయూత్‌ అధ్యక్షుడు దుర్గం ప్రశాంత్‌ ఆధ్వర్యంలో ముగ్గులపోటీలు నిర్వహించారు. పోటీల్లో దాదాపు80మంది యువ తులు, మహిళలు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొం దిన సెండేపూజకు ప్రథమ బహుమతిగా రూ.6 వేలు, సౌమ్యకు రెండవబహుమతిగా రూ.3వేలు, లావణ్యకు మూడవ బహుమతిగా రూ.1500లు మాజీఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీఅధ్యక్షుడు విశ్వప్ర సాద్‌రావు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సై ప్రశాం త్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దీపక్‌ముండే, గుర్నులే నారాయణ, మెంగాజీ, దాదాజీ, అంబెడ్కర్‌ సంఘం నాయకులు దుర్గం శ్యాంరావు, విలాస్‌, తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌: పట్టణంలో మంగళవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు తమ ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులను వేశారు. ఇంట్లో పూజలు చేసుకొని నోములను నోముకున్నారు. పండుగ సందర్భంగా వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు ఒకరికొకరు వాయినాలను అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

రెబ్బెన: మండంలోని గ్రామాల్లో ప్రజలు మంగళవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ ముంగిట్లో మహిళలు ముగ్గులను వేశారు. అనంతరం నోముకున్నారు.

Updated Date - Jan 15 , 2025 | 10:43 PM