Kumaram Bheem Asifabad: పాఠశాలల్లో విద్యార్థులకు ముగ్గుల పోటీలు
ABN , Publish Date - Jan 10 , 2025 | 11:17 PM
ఆసిఫాబాద్, జనవరి 10(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకొని మండ లంలోని బూర్గుడ ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు.
ఆసిఫాబాద్, జనవరి 10(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకొని మండ లంలోని బూర్గుడ ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. అనంతరం విజేత లుగా నిలిచిన వారికి బహుమతులను ప్రదానంచేశారు. కార్యక్ర మంలో హెచ్‌ఎం సదాశివ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నార.ు.
ఆసిఫాబాద్ రూరల్: మండలంలో సర స్వతి శిశుమందిర్ పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శుక్రవారం ముగ్గు లపోటీలు నిర్వహించివిజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్ టౌన్: కాగజ్‌నగర్ మండలలోని బట్టుపల్లి ప్రాథమికపాఠశాలలో శుక్రవారం ముగ్గులపోటీలు నిర్వహించారు. అనంతరం పాఠశాల 2025 సంవత్సరం క్యాలెండర్‌ను ఎంఈవో వాసాల ప్రభాకర్ ఆవిష్కరిం చారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎస్ ప్రధానోపాధ్యాయుడు కొమ్ము లక్ష్మినారాయణ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయు రాలు అనురాధ, టీయూటీ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శాంతి కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వాంకిడి: మండలంలోని కేజీబీవీ, సరండిప్రాథమికపాఠశాలలో శుక్ర వారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీల్లో సరండి పాఠశాలలో విజేతలకు హెచ్‌ఎం వినీష్ బహుమతులు ప్రదానం చేశారు.
దహెగాం: మండలంలోని పలు పాఠశాలల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శుక్ర వారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కిష్‌రావు, శారద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.