ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జాతీయ ఆరోగ్య మిషన్ సభ్యులు
ABN , Publish Date - Feb 19 , 2025 | 11:22 PM
జాతీయ ఆరోగ్య మిషన్ సభ్యులు
జన్నారం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఇందన్‌పల్లిలోని ఉప కేంద్రాన్ని జాతీయ ఆరోగ్య మిషన్ పీఆర్‌సీటీ సభ్యులు డాక్టర్ రమణ, డాక్టర్ శ్రీనివాస్ బుధవారం సందర్శించారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా అందిస్తున్న వైద్యసేవలు, ఆరోగ్య కార్య క్రమాలు, అంటువ్యాధుల నివారణకు తీసు కుంటున్న చర్యలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవాలు పెంచాలని, గర్భిణుల నమోదు చేపట్టాలని సూచించారు. క్షయ, కుష్ఠు నివారణ కార్యక్ర మాలు, 108, 102 అంబులెన్స్ సర్వీసుల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం లో డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్, ఉప జిల్లా వైద్యాధికారి సుధాకర్‌నాయక్, వైద్యాధికారి ఉమాశ్రీ, డీపీవో ప్రశాంతి, స్టాఫ్‌నర్సులు, ఫార్మాసిస్టులు, ఏఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.
- మాతా శిశు కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర బృందం
గర్మిళ్ల, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని బుధవారం పీఆర్‌సీటీ విశాఖపట్నం బృందం సభ్యులు డాక్టర్ రమణ, డాక్టర్ శ్రీనివాస్ సందర్శించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. హెల్ప్ డెస్క్ ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలనిసూచించారు. వారి వెంట డాక్టర్లు భీష్మ, అనిత, పవన్, వేదవ్యాస్, వెంకటేశ్వర్లు, ప్రశాంతి తదతరులు పాల్గొన్నారు.